16, ఏప్రిల్ 2024, మంగళవారం

రా వెన్నెల దొరా కన్నియను చేరా | Raa Vennela Dora | Song Lyrics | Lakshmi Kataksham (1970)

రా వెన్నెల దొరా కన్నియను చేరా



చిత్రం :  లక్ష్మీ కటాక్షం (1970)

సంగీతం :  కోదండపాణి

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల 


పల్లవి :


ఆహా...హ....అహ...హ...

అహ...హ.....ఓహో...ఓ...ఓ...

ఆహ....హ.....హా......


రా...వెన్నెల దొరా....కన్నియను చేరా

రా...కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ..ఆ


రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...

రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..   


చరణం 1 :


ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..

ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..

ఉన్నానులేవే ...ప్రియతమా....ఆ..ఆ


నీ మగసిరి నగవులు...చాలునులే...

నీ సొగసరి నటనలు చాలునులే...

నీ మనసైన తారను నే కానులే...


రా..వెన్నెల దొరా...వింత కనవేరా..

రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ.. 


చరణం 2 :


ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...

ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...

ఎద నిండిపోరా...చందమా....ఆ...ఆ..


నీ పగడపు పెదవుల...జిగి నేనే...

నీ చెదరని కౌగిలి ...బిగి నేనే...

నా ఎద నిండ నీవే నిలిచేవులే....


రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...

రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..


రా..వెన్నెల దొరా...వింత కనవేరా..

రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ..


పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి