19, మార్చి 2024, మంగళవారం

శ్రీమతిగారికి తీరని వేళ | Srimathi gariki teerani vela | Song Lyrics | Sharada (1973)

శ్రీమతిగారికి తీరని వేళ



చిత్రం :  శారద (1973)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వీటూరి

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల  


పల్లవి :


శ్రీమతిగారికి తీరని వేళ.. 

శ్రీవారి చెంతకు చేరని వేళ

శ్రీమతిగారికి తీరని వేళ.. 

శ్రీవారి చెంతకు చేరని వేళ

చల్లగాలి యెందుకు?.. 

చందమామ ఎందుకు?

మల్లెపూలు ఎందుకు?.. 

మంచి గంథ మెందుకు?

ఎందుకు? .... ఇంకెందుకు?


శ్రీమతిగారికి తీరని వేళ.. 

శ్రీవారికెందికీ గోల?

శ్రీమతిగారికి తీరని వేళ.. 

శ్రీవారికెందికీ గోల?

చల్లగాలి చెప్పవే... 

చందమామ చెప్పవే...

మల్లె తావి చెప్పవే ... 

మంచి మాట చెప్పవే...

చెప్పవే... చెప్పవే...


చరణం 1 :


ఓ చందమామా... ఓ చల్లగాలీ...

ఓ చందమామా... ఓ చల్లగాలీ...

నాపైన మీరైన చూపాలి జాలీ..

నాపైన మీరైన చూపాలి జాలీ..


లలలలలా.. హహహా.. 


బెట్టు చేసే అమ్మగారిని..

గుట్టుగా నా చెంత చేర్చాలి

మీరే చెంత చేర్చాలి...


శ్రీమతిగారికి తీరని వేళ.. 

శ్రీవారికెందికీ గోల?

చల్లగాలి చెప్పవే...

చందమామ చెప్పవే...

మల్లె తావి చెప్పవే ... 

మంచి మాట చెప్పవే...

చెప్పవే... చెప్పవే...


చరణం 2 :


ఓ దోవదేవా! ఓ దీన బంధో!

ఓ దోవదేవా! ఓ దీన బంధో!

ఒకసారి మా వారి ఈ బాధ చూడు

ఒకసారి మా వారి ఈ బాధ చూడు

ఆఆ.. ఉం..ఉమ్మ్..


అలకలోనే అలసి పోతే... 

అలకలోనే అలసి పోతే

ఇంత రేయి నవ్విపోయేను.. 

ఎంతో చిన్న బోయెను...


శ్రీమతిగారికి తీరిన వేళా.. 


శ్రీవారి చెంతకు చేరిన వేళా

చల్లగాలి యెందుకు?

చందమామ ఎందుకు?

మల్లెపూలు ఎందుకు?

మంచి గంథమెందుకు?


ఎందుకు? ఇంకెందుకు?


పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి