కృష్ణవేణి తెలుగింటి విరిబోణి
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయ భస్కర్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, రామకృష్ణ, సుశీల
సాకి :
హే జనని కృష్ణవేణి ... రాజిత తరంగవాణి
పంచ పాతక హారిణి... పరమ మంగళకారిణి...
దక్షినోర్వి దివ్యవాహిని ... అక్షీణ భాగ్య ప్రదాయిని ...
శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంశేవిని..
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని ..
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని...
కృష్ణవేణి... కృష్ణవేణి మమ: ప్రశీద.. మమ: ప్రశీద...
పల్లవి:
కృష్ణవేణి... కృష్ణవేణి....
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి ...
చరణం 1:
శ్రీగిరిలోయల సాగే జాడల..
శ్రీగిరిలోయల సాగే జాడల..
విద్యుల్లతలు కోటి వికశింపజేసేవు ...
లావణ్యలతవై నను చేరువేళ..
లావణ్యలతవై నను చేరువేళ...
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి ...
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
చరణం 2:
నాగార్జున గిరి కౌగిట ఆగి..
నాగార్జున గిరి కౌగిట ఆగి ...
బీళ్ళను బంగారు చేలుగా మార్చేవు ...
ఆంధ్రావనికై అన్నపూర్ణవై
కరువులు బాపేవు..
బ్రతుకులు నిలిపేవు..
నా జీవనదివై ఎదలోన ఒదిగి...
నా జీవనదివై ఎదలోన ఒదిగి ..
పచ్చని వలపులు పండించు కృష్ణవేణి ...
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
చరణం 3:
అమరావతి గుడి అడుగుల నడయాడి...
అమరావతి గుడి అడుగుల నడయాడి ..
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు...
ఏ శిల్పరమణులు.. ఏ దివ్యలలనలు
ఏ శిల్పరమణులు... ఏ దివ్యలలనలు
ఓర్చని అందాలు దాచిన కృష్ణవేణి ...
అభిసారికవై హంసలదీవిలో ...
సాగర హృదయాన సంగమించేవు...
నా మేని సగమై.. నా ప్రాణసుధవై..
నా మేని సగమై.. నా ప్రాణసుధవై..
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి...
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ...
కృష్ణవేణి నా ఇంటి అలివేణి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి