6, ఫిబ్రవరి 2024, మంగళవారం

పూజలు చేయ పూలు తెచ్చాను | Poojalu Cheya Poolu Techanu | Song Lyrics | Pooja (1975)

పూజలు చేయ పూలు తెచ్చాను



చిత్రం :  పూజ (1975)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : వాణీ జయరాం


పల్లవి :


పూజలు చేయ పూలు తెచ్చాను

పూజలు చేయ పూలు తెచ్చాను

నీ గుడి ముందే నిలిచాను

తియ్యరా తలుపులను... రామా

ఇయ్యరా దరిశనము...  రామా 


పూజలు చేయ పూలు తెచ్చాను 


చరణం 1 :

తూరుపులోన తెలతెలవారే

బంగరు వెలుగు నింగిని చేరే 


తొలి కిరణాల... ఆ... ఆ... ఆ... ఆ...

తొలి కిరణాల హారతి వెలిగే...  

ఇంకా జాగేలా స్వామీ

ఇయ్యరా దరిశనము రామా


ఇయ్యరా దరిశనము...  రామా

పూజలు చేయ పూలు తెచ్చాను


చరణం 2 :


దీవించేవో కోపించేవో...  

చెంతకు చేర్చి లాలించేవో

దీవించేవో కోపించేవో...  

చెంతకు చేర్చి లాలించేవో 


నీ పద సన్నిధి...  నా పాలిటి పెన్నిధి

నీ పద సన్నిధి...  నా పాలిటి పెన్నిధి

నిన్నే నమ్మితిరా స్వామీ

ఇయ్యరా దరిశనము రామా 


పూజలు చేయ పూలు తెచ్చాను

నీ గుడి ముందే నిలిచాను

ఇయ్యరా దరిశనము...  రామా 

పూజలు చేయ....  పూలు తెచ్చాను 


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి