కలలే కన్నానురా
చిత్రం : అసాధ్యుడు (1968)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జానకి
పల్లవి :
కలలే కన్నానురా...
ఆశతో ఉన్నానురా...
త్వరగా రావేమిరా....
కలలే కన్నానురా.....
చరణం 1 :
వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...
నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....
వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...
నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....
సొగసులన్ని దోచుకో... నన్ను నీలో దాచుకో...
కలలే కన్నానురా....
చరణం 2 :
నా సిగ్గు దోచేవు... నను చూసి నవ్వేవు....
మెరుపల్లే మెరిసేవు... మురిపించి పొయేవు...
కనులముందే ఉండిపో...
మనసునిండా నిండిపో...
కలలే కన్నానురా...
చరణం 3 :
లా...లా...లా..లా...
లలా....లలా....లలా....
పులకించే నా మేను...ఏమేమో కోరేను...
నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...
పులకించే నా మేను...ఏమేమో కోరేను...
నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...
వలపుపోంగే వేళరా...నీవు నాతో చేరరా....
కలలే కన్నానురా.....ఆశతో ఉన్నానురా......
త్వరగా....రావేమిరా....
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి