25, జనవరి 2024, గురువారం

ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా | A Buggameeda erramoggalendabba | Song Lyrics | Vajrayudham (1985)

ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా



చిత్రం :  వజ్రాయుధం (1985)

సంగీతం : చక్రవర్తి,

గీతరచయిత :  వేటూరి  

నేపథ్య గానం : SP బాలు, S జానకి


పల్లవి :


ఆ....

ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా

ఆ చల్లకొచ్చి ముంతదాచుడేందబ్బా

చూడగానె తాపమాయే ఎండలోన దీపమాయే

రెప్పకొట్టి గిల్లమాక

రెచ్చగొట్టి వెళ్ళామాక

రేపుదాక ఆగలేనులే ...


నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా

ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా

గుమ్మఈడు తాపమాయే గుండెలోన తాళమాయే

దగ్గరుంటె దప్పికాయే పక్కనుంటె ఆకలాయే

ఎక్కడింక దాగిపోనురా...


చరణం 1 :


ఎంతసిగ్గు పుట్టుకొచ్చే చెంపతాకితే

చెంపమొగ్గలేసుకొచ్చే చెయ్యితాకితే

యాడముట్టుకుంటే ఏదిపుట్టుకొస్తడో

పుట్టుకొచ్చి ఏది పుట్టి ముంచిపోతదో


అబ్బా...ఆగబ్బా

అబ్బా...ఉండబ్బా

చిన్న ముద్దబ్బా...హహ

ఇప్పుడొద్దబ్బా...హా..


ఆపుతున్నకొద్ది అగ్గిమంటబ్బా.

అంటుకున్నదంటె పెద్దటంతబ్బా

చెంగుపట్టి లాగగానే చీరకట్టు జారిపోయే

ఉన్నగుట్టు ఊరుదాటెరా


ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా

ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా


చరణం 2 :


ఈడువేడి ఎక్కిపోయె యాడతాకినా

నీరుకాస్త ఆవిరాయే నీడతాకినా

నిన్నుముట్టుకుంటె గుండెగంటకొట్టెనే

ఒంటిగున్న లోకమంత జంటకట్టెనే


అబ్బా... తప్పబ్బా..హ

తప్పే...ఒప్పబ్బా

ఒప్పుకొనబ్బా

ఒక్కసారబ్బా


ఎప్పుడంటె అప్పుడైతె ఎట్టబ్బా

గుట్టుమట్టు చూసుకోవు ఏందబ్బా

చుక్కపూల పక్కమీద జున్నుపాల పొంగులైతె

మల్లెపువ్వు మాటతప్పునా


నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా

ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా

గుమ్మఈడు తాపమాయే గుండెలోన తాళమాయే

రెప్పకొట్టి గిల్లమాక


రెచ్చగొట్టి వెళ్ళామాక

రేపుదాక ఆగలేనులే

నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా

ఆ చల్లకొచ్చి ముంతదాచుడేందబ్బా


పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి