22, డిసెంబర్ 2023, శుక్రవారం

గుమ్మెత్తించే ఈరేయి | Gammethinche ee reyi | Song Lyrics | Chal Mohana Ranga (1978)

గుమ్మెత్తించే ఈరేయి



చిత్రం : చల్ మోహన రంగ (1978)

సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)

గీతరచయిత : దాశరధి

నేపథ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి 


పల్లవి :


గుమ్మెత్తించే ఈ రేయి... 

అహా కోరికలెన్నో ఉన్నాయి

సిగ్గులు చెందిదమ్మాయి.. 

అహా సరసన చేరాడబ్బాయి

జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


గుమ్మెత్తించే ఈ రేయి... 

అహా కోరికలెన్నో ఉన్నాయి

సిగ్గులు చెందిదమ్మాయి.. 

అహా సరసన చేరాడబ్బాయి

జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో



చరణం 1 :


లోకం నిద్దుర పోతుంటే 

లోపల సందడి అవుతుంది

లోకం నిద్దుర పోతుంటే 

లోపల సందడి అవుతుంది

మత్తెక్కించే చీకటిలో 

మనసే ఊయల ఊగింది

అందిఅందని అందాలు 

అవి ఎందరికైనా సరదాలు

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


చరణం 2 :


గిన్నెల నిండా మధువుంది..ఓ... 

కన్నుల నిండా కైపుంది

గిన్నెల నిండా మధువుంది... 

కన్నుల నిండా కైపుంది


బుగ్గలు ముద్దులు కోరాయి... 

పెదవులు చెంతకు చేరాయి

కౌగిలినిండా వెచ్చదనం... 

కావల్సింది కొంటెతనం


ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


గుమ్మెత్తించే ఈ రేయి... 

అహా కోరికలెన్నో ఉన్నాయి

సిగ్గులు చెందిదమ్మాయి.. 

అహా సరసన చేరాడబ్బాయి

జత కుదరాలి కల విరియాలి... ఈ వేళా

ఇయ్యరో... ఇయ్యరా... ఇయ్యరో... ఇయ్యరో


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి