20, నవంబర్ 2023, సోమవారం

ముత్యాల ముంగిటిలో | Mutyala Mungitilo | Song Lyrics | Satyabhama (1981)

ముత్యాల ముంగిటిలో


చిత్రం :  సత్యభామ (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :   బాలు, సుశీల 


పల్లవి :


అహా... ముత్యాల ముంగిటిలో... 

పగడాల పల్లకిలో

ముత్యాల ముంగిటిలో.. 

అహా పగడాల పల్లకిలో

ఊరేగే పిల్లది.. ఊరించే కళ్ళది.. 

పెళ్ళాడ వొచ్చిందమ్మో  


ముత్యాల ముంగిటిలో.. 

అహా పగడాల పల్లకిలో

ముత్యాల ముంగిటిలో.. 

అహా పగడాల పల్లకిలో

ఓ కొంటె పిల్లడు మా ఇంటి అల్లుడు.. 

పెళ్ళాడ వచ్చాడమ్మో 


ముత్యాల ముంగిటిలో.. 

అహా పగడాల పల్లకిలో



చరణం 1 :


నింగీ నేలా తాళం వేసే చోట... 

ఏరూ నీరూ ఒకటై పోంగే చోట

కాలాల కడ దాకా... 

కాపురముంటామంటూ

కలలారబోసిందమ్మో... 

కలలారబోసిందమ్మో.. ఆ


జాబిల్లి సూరీడు మెరిసే చోటా...

ఆ దిక్కు ఈ దిక్కు కలిసే చోటా

ఏడేడు జన్మాల ఎలుగంత మనదంటు

కథలెన్నో చెప్పాడమ్మో... 

కథలెన్నో చెప్పాడమ్మో


హహ.. ముత్యాల ముంగిటిలో..  

పగడాల పల్లకిలో

ఓ కొంటె పిల్లడు మా ఇంటి అల్లుడు.. 

పెళ్ళాడ వచ్చాడమ్మో

ముత్యాల ముంగిటిలో.. 

అహా పగడాల పల్లకిలో 



చరణం 2 :


పువ్వు నవ్వు ఒకటై విరిసే చోట

ముద్దు మురిపాలొకటై మురిసే చోట

పరువాల పరిమళాలు... 

పండించుకుంద్దామంటూ

కబురేదో పంపాడమ్మో.. 

కబురేదో పంపాడమ్మో..

హోయ్ హోయ్ హోయ్


మెరుపే తానే మెరిసే చోట..

మేఘం నేనై ఒరిసే చోట...

జడివాన జల్లులోన జతనీవే రమ్మంటు...

కనుగీటి చెప్పిందమ్మో... 

కనుగీటి చెప్పిందమ్మో 


ముత్యాల ముంగిటిలో.. 

అహా.. పగడాల పల్లకిలో

ముత్యాల ముంగిటిలో.. 

అహా.. పగడాల పల్లకిలో

ఓ కొంటె పిల్లడు మా ఇంటి అల్లుడు.. 

పెళ్ళాడ వచ్చాడమ్మో 


ముత్యాల ముంగిటిలో.. 

అహా.. పగడాల పల్లకిలో

ముత్యాల ముంగిటిలో.. 

అరేరె.. పగడాల పల్లకిలో

ఊరేగే పిల్లది.. ఊరించే కళ్ళది.. 

పెళ్ళాడ వొచ్చిందమ్మో


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి