5, నవంబర్ 2023, ఆదివారం

ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు | Arumasalagu Pudathadu | song Lyrics | Pasi Hrudayalu (1973)

ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు



రచన  : ఆరుద్ర,

సంగీతం : GK వెంకటేష్ ,

గానం : SP బాలు , P సుశీల ,

చిత్రం : పసి హృదయాలు  (1973)


పల్లవి:

ఆరు మాసాలాగు.. పుడతాడు మనకో బాబు

ఆరు మాసాలాగు.. పుడతాడు మనకో బాబు

కనువిందుగా... ఇక పండుగ


ఆగనని అన్నానా.. ఆగడం చేశానా

ఆగనని అన్నానా.. ఆగడం చేశానా

మగవారే.. మహా తొందరా


ఓ...ఓ....ఓ... 

ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు


చరణం: 1

అందం చిందే బాబే ముద్దుల మూటా..

అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా

అందం చిందే బాబే ముద్దుల మూటా..

అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా


నేడు దొరగారూ వెంటపడతారూ

నేడు దొరగారూ వెంటపడతారూ

రేపు మీ బాబే లోకమంటారూ

పాపాయికే గిలిగింతలూ.. లాలింపులు


ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు


చరణం: 2

నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో

నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో

కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ

కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ


నిండినవి నెలలూ... పండునిక కలలూ

నిండినవి నెలలూ... పండునిక కలలూ

నేటి తొలి చూలు... రేపు మురిపాలు

నా ఆశలూ.. నా బాసలూ... తీరేనులే


ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు

కనువిందుగా... ఇక పండుగ

ఆగనని అన్నానా.. ఆగడం చేశానా

మహరాణికే.. ఈ తొందరా


ఓ...ఓ....ఓ... 

ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి