26, నవంబర్ 2023, ఆదివారం

అందరి బంధువయ్య | Andari Bandhuvayya | Song Lyrics | Devullu (2000)

అందరి బంధువయ్య



చిత్రం: దేవుళ్ళు (2000) 

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 

గీతరచయిత: జొన్నవొత్తుల 

నేపధ్య గానం: బాలు 



పల్లవి: 


రామా... ఆ.. ఆ.. 

అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

చెయుతనిచ్చె వాడయ్య.. 

మా సీతా రామయ్య 

చెయుతనిచ్చె వాడయ్య.. 

మా సీతా రామయ్య 

కొర్కెలు తీర్చే వాడయ్య.. 

కొదండ రామయ్య 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

రామా... ఆ... రామా... ఆ... ఆ... 



చరణం 1: 


తెల్లవారితే చక్రవర్తై 

రాజ్యమునేలె రామయ్య 

తండ్రిమాటకై పదవిని వదలి 

అడవులుకేగెనయా 

మహిలో జనులను కావగవచ్చిన 

మహవిష్ణు అవతరమయ 

ఆలిని రక్కసుడు అపహరించితె 

ఆక్రోశించెనయ 

అసురను ద్రుంచి అమ్మను తెచ్చి 

అగ్నిపరిక్ష విధించెనయ 

చాకలి నిందకు సత్యము చాటగ 

కులసతినేవిడనాడనయ 

నా రాముని కష్టం లోకంలో 

ఎవరూ పడలేరయ్యా 

ఆ... ఆ... 


నా రాముని కష్టం లోకంలో 

ఎవరూ పడలేరయ్యా 

సత్యం ధర్మం త్యాగంలో 

అతనుకి సరిలేరయ్య 

కరుణ హృదయుడు.. 

శరణనువాడికి 

అభయమొసుగునయ్యా 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 


చరణం 2: 


భద్రాచలము పుణ్యక్షేత్రము.. 

అంతా రామ మయం 

భక్తుడు భద్రుని కొండగ మార్చి.. 

కొలువై వున్న స్థలం 

పరమ భక్తితో రామదసు 

ఈ అలయమును కట్టించెనయ 

సీతారామ లక్ష్మణులకు 

ఆభరణములే చేయించెనయ 

పంచవటిని ఆ జనకిరాముల 

పర్ణశాల అదిగో 

సీతారాములు జలకములాడిన 

శేషతీర్ధమదిగో 

రామభక్తితో నదిగా మారిన 

శబరి ఇదేనయ్య 

ఆ... ఆ... ఆ... 

రామభక్తితో నదిగా మారిన 

శబరి ఇదేనయ్య 

శ్రీరామ పాదము నిత్యం 

కడిగే గోదారయ్య 

ఈ క్షేత్రం తీర్దం దర్శించిన... 

జన్మధన్యమయ్య... 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

చెయుతనిచ్చె వాడయ్య.. 

మా సీతా రామయ్య 

కొర్కెలు తీర్చే వాడయ్య.. 

కొదండ రామయ్య 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి