11, అక్టోబర్ 2023, బుధవారం

అమ్మీ ఓలమ్మీ గుమ్మైన అప్పలమ్మీ | Ammi Olammi | Song Lyrics | Chuttalunnaru Jagratha (1980)

అమ్మీ.. ఓలమ్మీ... గుమ్మైన అప్పలమ్మీ



చిత్రం : చుట్టాలున్నారు జాగ్రత్త (1980)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు, ఎస్ జానకి,


పల్లవి : 


అమ్మీ.. ఓలమ్మీ... గుమ్మైన అప్పలమ్మీ

నా సింతమాను సిగురా... 

నా గున్నమావిడి గుబురా

నా ఏడి ఉలవ చారా... 

నా ఇప్పపూల సారా 


అరిసెల పాకం కన్నా అందమైన దానా

అరిసెల పాకం కన్నా అందమైన దానా

నువ్వు అలకేసిపోతుంటే నేనాగుతానా

నువ్వు అలకేసిపోతుంటే నేనాగుతానా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అహా


అబ్బీ.. ఓరబ్బీ... సురుకైన సోకులబ్బీ

నా సింగరాయ కొండ... నా సికాకోలు దండ

నా చంద్రహారం గొలుసా... 

నా బొమ్మిడాయల పులుసా


బుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...

బుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...

నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...

నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హోయ్




చరణం 1 :


తాళపాకలో నిన్ను కలిసినప్పుడు...

రంగుగళ్ళ కోకలో నువ్వు మెరిసినప్పుడు

నిన్ను సూశానో లేదో... చెయ్యి వేశానో లేదో

నిన్ను సూశానో లేదో... చెయ్యి వేశానో లేదో

నువ్వు నిప్పుదగరి లక్కలాగ కరగలేదా

కరిగి కరిగి ఒక్క మాటు ఒరగలేదా


ఎల్లమ్మ జాతరకు ఎళ్ళినప్పుడు..

ఎంట ఎంటబడి నా చెయ్యి గిల్లినప్పుడు

కాస్త కసిరానో లేదో... కొంగు ఇసిరానో లేదో

కాస్త కసిరానో లేదో... కొంగు ఇసిరానో లేదో

నువ్వు కాలు కాలిన పిల్లిలాగ తిరగలేదా

తిరిగి తిరిగి అరుగు మీద ఒరగలేదా


అమ్మీ.. ఓలమ్మీ... గుమ్మైన అప్పలమ్మీ

నా సింతమాను సిగురా... 

నా గున్నమావిడి గుబురా

నా ఏడి ఉలవ చారా... నా ఇప్పపూల సారా 


గుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...

నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...

నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అహా


చరణం 2 :


సందెకాడ నేను తానం ఆడినప్పుడు...

తడిక చాటు నుంచి నువ్వు పొంచి చూసినప్పుడు

అయ్య లేశాడో లేడో... కర్ర తీశాడో లేదో

నా కాళ్ళా వేళ్ళా పడి మొక్కలేదా

కట్టుకుంటానని ఒట్టు పెట్టలేదా


నీ సికిలి చూపు నాపైన విసిరినప్పుడు

నీ ముఖమంతా సిరునవ్వే ముసిరినప్పుడు

ఏవయ్యిందో ఏమో... ఏమౌతుందో ఏమో

ఆ నాటి నుంచి నా మనసే నిలవకున్నదే

నాటు మందేసినా నీ ఊసే ఒదలకున్నదే


గుడమేటి వరద కన్న ఖరుసైన వాడా...

నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...

నీ బాడా చోరు మాటలకు బదులు చెప్పలేనా...

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హోయ్  


అరిసెల పాకం కన్నా అందమైన దానా

నువ్వు అలకేసి పోతుంటే నేనాగుతానా

నువ్వు అలకేసి పోతుంటే నేనాగుతానా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అహా


పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి