అదివో అల్లదివో శ్రీహరి వాసము
చిత్రం : కలియుగ దైవం (1983)
సంగీతం : సత్యం
రచన : అన్నమాచార్య
గానం : P సుశీల
పల్లవి :
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో...
చరణం 1 :
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకూ
అదె చూడుడూ అదె మ్రొక్కుడూ..
ఆనందమయము...
అదివో అల్లదివో శ్రీహరి వాసము
భువనమోహన కౌసల్య ముద్దుబిడ్డ
తూరుపు తెల్లవారుతున్నదో తోయజాక్షి
దేవకార్యములన్నియు దీర్ప వలయు
తొందరగా నిద్ర మేలుకో సుందరాంగా
చరణం 2 :
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీగిరియు వృషభాద్రియు శేషశైలమనియు
నారాయణాద్రియు నట వృషాద్రి పేర్మి
గరుడాచలమ్మని వేంకటాద్రి పేర
నీ ఏడుకొండలను పిలుచుచుందురు
మేలుకో సప్తగిరివాస
మేలుకో ... మేలుకో ...
చరణం 3 :
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
పావనములకెల్ల పావన మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీ హరివాసమూ శ్రీహరివాసమూ
శ్రీహరివాసమూ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి