20, సెప్టెంబర్ 2023, బుధవారం

మదిలో విరిసే తీయని రాగం | Madilo virise teeyani raagam | Song Lyrics | Rendu Kutumbala Katha (1970)

మదిలో విరిసే తీయని రాగం



చిత్రం :  రెండు కుటుంబాల కథ (1970)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :

ఆ.. ఆ... ఆ...

ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ...


మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ... ఏవో మమతలు పెంచేనూ 


మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ... 

ఏవో మమతలు పెంచేనూ 


చరణం 1 :


అల్లరి చేసే పిల్లగాలి.. 

మల్లెలు నాపై జల్లు వేళ

అల్లరి చేసే పిల్లగాలి.. 

మల్లెలు నాపై జల్లు వేళ 


కోరికలన్నీ ఒకేసారి ఎగసి... 

ఆ.. ఆ.. హా.. ఆ.. ఆ..

కోరికలన్నీ ఒకేసారి ఎగసి.. 

ఆకాశంలో హంసల రీతి

హాయిగ సాగేనులే...



మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ... 

ఏవో మమతలు పెంచేనూ 


చరణం 2 :


పరవశమంది పాట పాడి... 

గానలహరిలో తేలి ఆడి

పరవశమంది పాట పాడి... 

గానలహరిలో తేలి ఆడి  


హృదయములోనా వసంతాలు పూయా...

హృదయములోనా వసంతాలు పూయా...

కన్నులలోనా వెన్నెల కురియా... 

కాలము కరగాలిలే.. 


మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ... 

ఏవో మమతలు పెంచేనూ


పాటల ధనుస్సు 


1 కామెంట్‌: