2, సెప్టెంబర్ 2023, శనివారం

ఎంత సొగసుగా ఉన్నావూ | Entha Sogasuga vunnavu | Song Lyrics | Punyavathi (1967)

ఎంత సొగసుగా ఉన్నావూ



చిత్రం : పుణ్యవతి (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఎంత సొగసుగా ఉన్నావూ ...

ఎలా ఒదిగిపోతున్నావూ

కాదనకా..ఔననకా..

కౌగిలిలో దాగున్నావూ


ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..

ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...

 కాదనకా..అహా

 ఔననకా..ఆహా..

 కౌగిలిలోదాగున్నావూ..

ఎంతసొగసుగా ఉన్నావూ...


చరణం : 2


అందీ అందని హంసల నడకలు.. 

ముందుకు రమ్మనెనూ..ఆ ఆ

చిందీ చిందని చిరుచిరు నవ్వులు 

ఎందుకు పొమ్మనెనూ..ఆ ఆ

అందీ అందని హంసల నడకలు.. 

ముందుకు రమ్మనెనూ

చిందీ చిందని చిరుచిరు నవ్వులు 

ఎందుకు పొమ్మనెనూ

నీ తనువే.. తాకగనే.. 

నామది ఝుమ్మనెనూ 


ఎంత సొగసుగా వున్నావూ..

ఆహాహాహా..

ఎలా ఒదిగి పోతున్నావూ..

ఆహహాహా...

కాదనకా..అహా

ఔననకా..ఆహా..

కౌగిలిలోదాగున్నావూ..


ఎంతసొగసుగా ఉన్నావూ...


చరణం : 2


తడిసీ తడియని నీలికురులలో..

కురిసెనుముత్యాలూ..ఆ ఆ

విరిసీ విరియని వాలుకనులలో..

మెరిసెను నీలాలూ..ఆ ఆ

తడిసీ తడియని నీలికురులలో..

కురిసెనుముత్యాలూ

విరిసీ విరియని వాలుకనులలో..

మెరిసెను నీలాలూ

పులకించే..పెదవులపై..

పలికెను పగడాలూ


ఎంత సొగసుగా వున్నావూ..

ఆహాహాహా..

ఎలా ఒదిగి పోతున్నావూ..

ఆహహాహా...

కాదనకా..అహా

ఔననకా..ఆహా..

కౌగిలిలోదాగున్నావూ..

ఎంతసొగసుగా ఉన్నావూ...


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి