16, సెప్టెంబర్ 2023, శనివారం

అందమైన జీవితము అద్దాల సౌధము | Andamaina Jeevithamu | Song Lyrics | Vichitra Bandham (1972)

అందమైన జీవితము.. అద్దాల సౌధము



చిత్రం :  విచిత్ర బంధం (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  సుశీల, ఘంటసాల 



పల్లవి :


అందమైన జీవితము.. అద్దాల సౌధము..

చిన్నరాయి విసిరినా.. చెదరిపోవును

ఒక్క తప్పు చేసినా.. ముక్కలే మిగులును 


అందమైన జీవితము అద్దాల సౌధము

చిన్నరాయి విసిరినా.. చెదరిపోవును

ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును

అందమైన జీవితము.. అద్దాల సౌధము



చరణం 1 :


నిప్పువంటి వాడవు తప్పు చేసినావు.. 

ఎంత తప్పు చేసినావు

క్షణికమైన ఆవేశం మనసునే చంపింది.. 

నిన్ను పశువుగా మార్చింది


నీ పడుచుదనం దుడుకుతనం 

పంతాలకి పోయింది

పచ్చనైన నీ బ్రతుకుని పతనానికి లాగింది.. 

నిన్ను బలిపశువును చేసింది 


అందమైన జీవితము.. అద్దాల సౌధము



చరణం 2 :


ఎవరిది ఈ నేరమని ఎంచి చూడదు..

లోకం ఎంచి చూడదు 

ఏదో పొరపాటని మన్నించదు.. 

నిన్ను మన్నించదు


అరిటాకు వంటిది ఆడదాని శీలము.. 

అరిటాకు వంటిది ఆడదాని శీలము 

ముల్లు వచ్చి వాలినా.. తాను కాలు జారినా..

ముప్పు తనకే తప్పదు.. 

ముందు బ్రతుకె వుండదు 


అందమైన జీవితము.. అద్దాల సౌధము

చిన్నరాయి విసిరినా చెదరిపోవును

ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును

అందమైన జీవితము.. అద్దాల సౌధము


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి