5, సెప్టెంబర్ 2023, మంగళవారం

అదిగదిగో యమునా తీరం | Adigadigo Yamuna Teeram | Song Lyrics | Tella Gulabeelu (1985)

అదిగదిగో యమునా తీరం



రచన : మైలవరపు  గోపి,

సంగీతం  : శంకర్  గణేష్ ,

గానం  : SP బాలు , S జానకి,  

చిత్రం : తెల్ల  గులాబీలు (1985)


పల్లవి:

అదిగదిగో..ఓ ఓ ఓ ఓ.. యమునా తీరం

మాసం చైత్రం

సంధ్యా సమయం

అటూ ఇటూ .. పొద ఎద..

అంతా విరహం విరహం ..

మరీ మరీ వే..గిపోతోంది హృదయం

అయినా ప్రణయం మధురం

ప్రియా ప్రియా .. జా..రిపోనీకు తరుణం

అదిగదిగో..ఓ ఓ ఓ ఓ.. యమునా తీరం

మాసం చైత్రం

సంధ్యా సమయం

అటూ ఇటూ .. పొద ఎద..

అంతా విరహం విరహం ..

మరీ మరీ వే..గిపోతోంది హృదయం


అయినా ప్రణయం మధురం

ప్రియా ప్రియా .. జా..రిపోనీకు తరుణం


చరణం 1:

దూరాన ఏ వాడలోనా ..

వేణుగానాలు రవళించసాగె

ఓ ఓ ఓ ఓ ఓ గానాలు వినిపించగానే ..

యమునా తీరాలు పులకించిపోయే


పూల పొదరిళ్ళు పడకిళ్ళు కాగా

చిగురు పొత్తిళ్ళ తల్పాలు కా..గా ...

ఎన్ని కౌగిళ్ళ గుబులింతలాయే..

అదిగదిగో..ఓ ఓ ఓ ఓ.. యమునా తీరం

మాసం చైత్రం

సంధ్యా సమయం

అటూ ఇటూ .. పొద ఎద..

అంతా విరహం విరహం ..

మరీ మరీ వేగిపోతోంది హృదయం....

అయినా ప్రణయం మధురం

ప్రియా ప్రియా .. జారిపోనీకు తరుణం


చరణం 2:

విధిలేక పూచింది గాని ...

ముళ్ల గోరింట వగచింది యెదలో ..

ఆ ఆ ఆ ఆ .. పూచింది .. ఏ చోటనైనా ..

పువ్వు చేరింది పూమాలనేగా ..

ఏ సుడిగాలి తో ఓడిపోకా ..

ఏ జడివానకీ రాలిపోకా ..

స్వామి పాదాల చేరింది తుదకు ..


అదిగదిగో..హా ఆ ఆ ఆ ..యమునా తీరం

మాసం చైత్రం

సంధ్యా సమయం

అటూ ఇటూ .. పొద ఎద..

అంతా విరహం విరహం ..

మరీ మరీ వే...గిపోతోంది హృదయం


హా..అయినా ప్రణయం మధురం

ప్రియా ప్రియా .. జా...రిపోనీకు తరుణం


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి