ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు
చిత్రం: ఇంద్ర ధనుస్సు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....
ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...
మల్లె రంగు నా మనసు...
మల్లె రంగు నా మనసు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....
ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...
మల్లె రంగు నా మనసు...
మల్లె రంగు నా మనసు..
చరణం 1:
పసిడి పసుపు.. మేని రంగు..
సందె ఎరుపు.. బుగ్గ రంగు..
నీలి రంగుల..కంటి పాపల..
కొసలలో ....నారింజ సొగసులు..
ఆకు పచ్చని.. పదారేళ్ళకు..
ఆశలెన్నో.. రంగులు..
ఆ ఆశలన్ని.... ఆకాశానికి...
ఎగసి వెలెసెను..ఇంద్రధనుసై..
ఇంద్రధనుసై..ఇంద్రధనుసై
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....
ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...
మల్లె రంగు నా మనసు...
మల్లె రంగు నా మనసు...
చరణం 2:
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును
ఎక్కుపెట్టిన వీరుడు...
ఎవ్వడే నా యవ్వనాన్ని
ఏలుకోగల మన్మధుడు...
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును
ఎక్కుపెట్టిన వీరుడు...
ఎవ్వడే నా యవ్వనాన్ని
ఏలుకోగల మన్మధుడు...
వాడి కోసం వాన చినుకై
నిలిచి ఉంటా నింగిలోనా..
వాడి వెలుగే ఏడురంగుల...
ఇంద్రధనుసై నాలో..
ఇంద్రధనుసై నాలో.....
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు....
ఈడు వచ్చిన నా వయసు.....
ఆ ఏడు రంగులు ఏకమైన...
మల్లె రంగు నా మనసు...
మల్లె రంగు నా మనసు...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి