28, ఆగస్టు 2023, సోమవారం

అనురాగ దేవత నీవే | Anuraga Devatha neeve | Song Lyrics | Kumara Raja (1978)

అనురాగ దేవత నీవే



రచన  : వేటూరి సుందరరామమూర్తి 

సంగీతం  : K V మహదేవన్ 

గానం  : SP బాలు 

చిత్రం  : కుమార రాజా  (1978)


పల్లవి:

అనురాగ దేవత నీవే.. 

నా ఆమని పులకింత నీవే

నా నీడగా ఉంది నీవే.. 

నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే

అనురాగ దేవత నీవే.. 

నా ఆమని పులకింత నీవే

నా నీడగా ఉంది నీవే.. 

నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే


చరణం 1:

ఏనాటిదో ఈ అనుబంధం...ఉ..ఉ.. 

ఎద చాలని మధురానందం..ఉ..

ఏనాటిదో ఈ అనుబంధం.. 

ఎద చాలని మధురానందం..ఊ..

నేనేడు జన్మలు ఎత్తితే.. 

ఏడేడు జన్మలకు ఎదిగే బంధం

ఇది వీడరాని బంధం.. 

మమతానురాగ బంధం...


అనురాగ దేవత నీవే..ఏ...


చరణం 2:

నను నన్నుగా ప్రేమించవే.. 

నీ పాపగా లాలించవే..

నను నన్నుగా ప్రేమించవే.. 

నీ పాపగా లాలించవే...

నా దేవివై దీవించవే.. 

నా కోసమే జీవించు

నీ దివ్యసుందర రూపమే.. 

నా గుండె గుడిలో వెలిగే దీపం

నా జీవితం నీ గీతం.. 

మన సంగమం సంగీతం...


అనురాగ దేవత నీవే.. 

నా ఆమని పులకింత నీవే

నా నీడగా ఉంది నీవే.. 

నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే..

అనురాగ దేవత నీవే..


 పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి