29, మే 2023, సోమవారం

వందనం అభివందనం | Vandanam Abhivandanam | Song Lyrics | Premabhishekam (1981)

వందనం అభివందనం



చిత్రం :  ప్రేమాభిషేకం (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి

నేపధ్య గానం : బాలు


పల్లవి :


వందనం అభివందనం

నీ అందమే ఒక నందనం

వందనం అభివందనం

నీ అందమే ఒక నందనం


నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ

పాదాభివందనం...  పాదాభివందనం...

పాదాభివందనం...  పాదాభివందనం...


వందనం అభివందనం

నీ అందమే ఒక నందనం



చరణం 1 :


కన్నులు పొడిచిన చీకటిలో... 

ఆరే దీపపు వెలుగుల్లో

తీరని ఊహల రేవుల్లో...  

తీరం చేరని పడవల్లో

వస్తానని నేను వస్తానని

వస్తానని నేను వస్తానని 



తలపుల తలుపుకు తనువిచ్చి

వలపుల గడపకు నడుమిచ్చి

తలపుల తలుపుకు తనువిచ్చి

వలపుల గడపకు నడుమిచ్చి

ఎదురు చూసిన సారిక అభిసారిక.. సారీ..  



వందనం అభివందనం

నీ అందమే...  ఒక నందనం




చరణం 2 :



జీవితమన్నది మూడునాళ్ళని... 

యవ్వనమన్నది తిరిగిరాదని

ప్రేమన్నది ఒక నటనమనీ...

నీకంటూ ఎవరున్నారని


ఉన్నారని... ఎవరున్నారని

ఉన్నానని...  నేను ఉన్నానని


ప్రేమపురానికి సెలవిచ్చి

స్వర్గపురానికి దారిచ్చి

ప్రేమపురానికి సెలవిచ్చి

స్వర్గపురానికి దారిచ్చి

సుఖము పోసిన మేనక...  

అభినయ మేనక.. సారీ 


వందనం అభివందనం

నీ అందమే ఒక నందనం

నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ

పాదాభివందనం...  పాదాభివందనం...

పాదాభివందనం...  పాదాభివందనం...


వందనం అభివందనం

నీ అందమే ఒక నందనం


వందనం అభివందనం

నీ అందమే ఒక నందనం


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి