21, మే 2023, ఆదివారం

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి | Srirastu Shubamstu | Song Lyrics | Srirastu Shubamastu (1981)

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి



చిత్రం : శ్రీరస్తు-శుభమస్తు (1981)

సంగీతం : జె. వి. రాఘవులు   

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, సుశీల   



శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

కవ్వింతల నుంచి కౌగిలింతల దాక

కౌగిలింతల నుంచి కల్యాణం దాకా


శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి 

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

కవ్వింతల నుంచి కౌగిలింతల దాక

కౌగిలింతల నుంచి కల్యాణం దాకా


శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి


ప్రేమకు వచ్చే పెళ్ళీడు... 

పెద్దలు మెచ్చే మా జోడు

లగ్గం కుదిరేదెన్నటికో... 

పగ్గాలెందుకు ముద్దాడు


ప్రేమకు వచ్చే పెళ్ళీడు... 

పెద్దలు మెచ్చే మా జోడు

లగ్గం కుదిరేదెన్నటికో... 

పగ్గాలెందుకు ముద్దాడు


మనసు మనసు మనువాడె... 

మనకెందుకులే తెరచాటు

నీ అరముద్దులకే విజయోస్తు... 

నీ అనురాగానికి దిగ్విజయోస్తు


శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి