10, మే 2023, బుధవారం

కొండపై నిండుగా | Kondapai ninduga | Song Lyrics | Agni Pareeksha (1970)

కొండపై నిండుగా 



చిత్రం : అగ్ని పరీక్ష (1970)

రచన : కొసరాజు,

సంగీతం : ఆదినారాయణరావు 

గానం : ఘంటసాల 


కొండపై నిండుగా కొలువున్న మా తల్లి 

కనకదుర్గ నీకు జేజేలు 

లోక జననీ శాంభవి నీకు దండాలు


ll కొండపై ll


భూలోకమందు మా పూజలందుకొనంగ 

దుర్గవై ఇచటకు దిగి వచ్చవు 

కనకదుర్గావై ఇక్కడే నిలచావు

ll భూలోక ll


కాళీవైన మహాంకాళీవైన నీవె 

బహురూపాల మమ్ము

బ్రోచు అమ్మవు నీవే


ll కొండపై ll


శాంతముతో నీవు ప్రత్యక్షమైతేను 

చిరునవ్వుల వెన్నెలలు కురిసేను 

కరుణారసం వెల్లివిరిసెను

ll శాంతముతో ll


ఉగ్రంతో నువ్వు ఉరిమి చూసావంటే

గుప్పు గుప్పున నిప్పులు ఉరిమేను

గప్పు గప్పున మంటలు ఎగసేను

దుర్గా కనకదుర్గా కనకదుర్గా


పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి