20, ఏప్రిల్ 2023, గురువారం

క్షణం క్షణం నిరీక్షణం | Kshanam Kshanam Nireekshanam | Song Lyrics | Tiger (1979)

క్షణం క్షణం నిరీక్షణం



చిత్రం: టైగర్ (1979)

సంగీతం: సత్యం

గీతరచయిత : సినారె 

నేపథ్య గానం: బాలు, జానకి


పల్లవి :


క్షణం క్షణం ....నిరీక్షణం...

నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...

నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...


క్షణం క్షణం ....నిరీక్షణం..

నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...

నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...


చరణం 1 :

ఏ కిరణం సోకినా… ఏ పవనం తాకినా...

ఏ మేఘం సాగినా.... ఏ రాగం మ్రోగినా...

నిన్నే తలచి… నన్నే మరచి… నీకై వేచాను....

ఊ..ఊం...ఊం....ఊం...ఊం.....


క్షణం క్షణం ....నిరీక్షణం...

నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...

నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...


చరణం 2 :

నీ రూపే దీపమై...నీ చూపే ధూపమై...

నీ పిలుపే వేణువై...నీ వలపే ధ్యానమై...

వేకువలోనా...వెన్నెలలోనా...నీకై నిలిచాను...

ఊమ్మ్....ఉమ్మ్...ఊమ్మ్......ఊమ్మ్....


క్షణం క్షణం ....నిరీక్షణం...

నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...

ఓ..ఓ..నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...


క్షణం క్షణం ....నిరీక్షణం...

క్షణం క్షణం ....నిరీక్షణం...

నిరీక్షణం...క్షణం క్షణం

నిరీక్షణం...క్షణం క్షణం


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి