ఏం దెబ్బతీశావు ఏం ఎత్తు వేశావు
చిత్రం : టైగర్ (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..
ఏం ఎత్తు వేశావు
ఏం మాయచేశావబ్బీ..ఈ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది
అహా..ఏం బాగా అన్నావు ..
ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ....
నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...
ఒకలాగున్నది... మతిపోతున్నది..
అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది
చరణం 1 :
ఓ..ఉరికేటి ఓ కొండవాగు..
ఒక కొంతసేపైన ఆగు
ఆ ఊపు తగ్గించుకొంటే....
నీ ఒంటికి బాగు బాగు
నాదేమో నునుపైన సొగసు...
నీదేమో కరుకరుకున్న వయసు
నీతోటి సరితూగకుంటే...
నీరౌను నా బేలమనసు
అహ్హా..అహా..ఏం బాగా ఉన్నావు..
ఏం ముద్దుగున్నావు...
ఏం చూపుతున్నావమ్మీ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది
చరణం 2 :
నీకుంది పదునైన పొగరు...
లేదెవరు నీకింక ఎదురు
నిను తలచుకుంటేనే చాలు...
గుండెల్లో ఒక తీపి అదురు
అరే..పడబోకు నావెంట వెంటా...
ఉడికించకు ఓరకంటా..
పైటల్లె నను చూసుకుంటే...
పదిలంగ నీతోనే ఉంటా..
హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..
ఏం ఎత్తు వేశావు
ఏం మాయచేశావబ్బీ..ఈ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది
అహా..ఏం బాగా అన్నావు ..
ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..అహా
నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...
ఒకలాగున్నది... మతిపోతున్నది..
అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి