1, మార్చి 2023, బుధవారం

మేలుకో మేలుకో సాయినాధా | Meluko Meluko Sainadha | Song Lyrics | RKSS Creations

సాయినాధుని మేలుకొలుపు:



గీత రచన : రామకృష్ణ దువ్వు
స్వరకల్పన : S వేణుమాధవ్,
గానం : T కృష్ణారావు
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం
నిర్మాణం : RKSS క్రియేషన్స్


సాకి:
సుప్రభాత వేళయ్యింది
అప్రమేయ ప్రభాకరుడు
ఏక చక్ర రధమునెక్కి
అరుదెంచే వేళాయె
పల్లవి:

మేలుకో మేలుకో సాయినాధా
భక్తుల పాలిటి తేజము ఓ గురునాధా
నేత్రయుగళి తెరచి మాకు త్రోవచూపు
సద్గురునాధా

భక్తుల పాలిటి తేజము ఓ గురునాధా
నేత్రయుగళి తెరచి మాకు త్రోవచూపు
సద్గురునాధా
మేలుకో మేలుకో ఓ సాయినాధా

చరణం :

చిరునవ్వు చిందే నీ మోము చూడందే
తెలవారదు సాయి ఏనాడు మాకు
చిరునవ్వు చిందే నీ మోము చూడందే
తెలవారదు సాయి ఏనాడు మాకు
గురునాజ్ఞ లేనిదే పశువులు మేయవు
పక్షులు కూయవు …
నిన్నే మనసున నిలుపుకున్న మేము
ఎలా బ్రతుకగలము
గురునాజ్ఞ లేనిదే పశువులు మేయవు
పక్షులు కూయవు …
నిన్నే మనసున నిలుపుకున్న మేము
ఎలా బ్రతుకగలము
నీ చల్లని చూపులే మము నడిపించాలి
కన్నులు తెరు ఓ సాయినాధా..

మేలుకో మేలుకో ఓ సాయినాధా
చరణం:

సిరిమల్లె పూవులు నీకోసం పూచాయి
పూమాలగా మారి నీకోసం వేచాయి
సిరిమల్లె పూవులు నీకోసం పూచాయి
పూమాలగా మారి నీకోసం వేచాయి

సద్గురుని సేవించ నీగుడి వాకిట
భక్తుల కిట కిట ..
నీ శుభ చరణాలు భక్తితో సేవించ
వచ్చి నిలుచున్నాము…

సద్గురుని సేవించ నీగుడి వాకిట
భక్తుల కిట కిట ..
నీ శుభ చరణాలు భక్తితో సేవించ
వచ్చి నిలుచున్నాము…
సూర్య చంద్రులనే నిలుపుకున్నట్టి
కన్నులు తెరువు ఓ సాయినాధా..


మేలుకో మేలుకో సాయినాధా
భక్తుల పాలిటి తేజము ఓ గురునాధా
నేత్రయుగళి తెరచి మాకు త్రోవచూపు
సద్గురునాధా
భక్తుల పాలిటి తేజము ఓ గురునాధా
నేత్రయుగళి తెరచి మాకు త్రోవచూపు
సద్గురునాధా

మేలుకో మేలుకో ఓ సాయినాధా


- RKSS Creations




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి