19, జనవరి 2023, గురువారం

మంచు ముత్యానివో | Manchu Mutyanivo | Song Lyrics | Ramudu Kadu Krishnudu (1983)

మంచు ముత్యానివో



చిత్రం : రాముడు కాదు కృష్ణుడు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు


పల్లవి :


మంచు ముత్యానివో..హంపి రతనానివో..ఓ..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో...

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో ..ఓ..

మంచు ముత్యానివో..హంపి రతనానివో..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో...

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో


మంచు ముత్యానివో..



చరణం 1 :


తెలుగు బడిలో తొలుత చుట్టిన శ్రీకారానివో

జానపదమున తీపి కలిపిన నుడికారానివో

గాలి వాటుకు..ఎండ పోటుకు..

తాళలేని ఆకు చాటు పిందెవో

కూచిపూడి కొమ్మవో...కొండపల్లి బొమ్మవో...

ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..

ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు

ప్రతిగా.. కృతిగా.. ఆకృతిగా.. నిలిచే సుందరివో


మంచు ముత్యానివో..ఓ..హంపి రతనానివో..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో

మంచు ముత్యానివో..ఓ..   



చరణం 2 :


కాళిదాసుని కావ్యకవితకు ఆకారానివో

దేవరాయని శిల్ప చరితకు ప్రాకారానివో

రెప్ప పాటుకు ..లిప్త చూపుకు..

అందరాని అందమైన మెరుపువో

మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో..

విరగబూసిన నిండు పున్నమికి..

తిరగబోసిన పండు వెన్నెలకు

ప్రతిగా.. కృతిగా ..ఆకృతిగా .. నిలిచే సుందరివో


మంచు ముత్యానివో..ఓ..హంపి రతనానివో..ఓ..

తెలుగు వాకిట వేసిన ముగ్గువో..

ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో..ఓ..

మంచు ముత్యానివో..ఓ..


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి