11, డిసెంబర్ 2022, ఆదివారం

మేఘాల మీద సాగాలి | Meghalameeda meeda sagali | Song Lyrics | Devadasu (1974)

మేఘాల మీద సాగాలి



చిత్రం :  దేవదాసు (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : బాలు 



పల్లవి : 


మేఘాల మీద సాగాలి..  

అనురాగాల రాశిని చూడాలి

నే పదం పాడుతూ ఉరకాలి...  

నువు కదం తొక్కుతూ ఎగరాలి..

ఆ... హా... హా ...హా... ఓహో.... హో....

చల్ రే బేటా చల్...     చల్ రే బేటా చల్

చల్ రే బేటా చల్ చల్...  చల్ రే బేటా చల్



చరణం 1 :



చిన్ననాటి ఆ చిలిపితనం

కన్నె వయసులో పెరిగిందా?

వన్నెల చిన్నెల పడుచుతనం 

వాడిగా పదును తేరిందా?

 తెలుసుకోవాలి.. కలుసుకోవాలి.. 

పారును.. నా పారును 


మేఘాల మీద సాగాలి..  

అనురాగాల రాశిని చూడాలి

నే పదం పాడుతూ ఉరకాలి...  

నువు కదం తొక్కుతూ ఎగరాలి..

ఆ హా... హా ...ఓహో.... హో....

చల్ రే బేటా చల్...   చల్ చల్ రే బేటా చల్

చల్ రే బేటా చల్ చల్ చల్ రే బేటా చల్ 




చరణం 2 :


ఆమెకు ఎంతో అభిమానం 

అయినా నేనే ప్రాణం

నా మొండితనంలో తీయదనం 

ఆ చెవులకు మురళీగానం

ఏడిపించాలి..  కలసి నవ్వాలి..  

పారుతో... నా పారుతో


మేఘాల మీద సాగాలి..  

అనురాగాల రాశిని చూడాలి

నే పదం పాడుతూ ఉరకాలి...  

నువు కదం తొక్కుతూ ఎగరాలి..

ఆ హా... హా ...ఓహో.... హో....

చల్ రే బేటా చల్...   చల్ చల్ రే బేటా చల్

చల్ రే బేటా చల్ చల్ చల్ రే బేటా చల్


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి