8, డిసెంబర్ 2022, గురువారం

కథ విందువా నా కథ విందువా | Katha vinduva | Song Lyrics | Kode Nagu (1974)

కథ విందువా



చిత్రం : కోడెనాగు (1974)

సంగీతం : పెండ్యాల

గీతరచయిత : ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల 


పల్లవి :


కథ విందువా...నా కథ విందువా

విథికి బదులుగ నువ్వు 

నా నుదుట వ్రాసిన కథ విందువా...

నా కథ విందువా


చరణం 1 :


బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు

బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు

అన్న అనుమాటతో అన్ని తుంచేశావు

పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి

ఉరితాడు నా మెడకు వేయించినావు


కథ విందువా...నా కథ విందువా



చరణం 2 :


తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది

తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది

కసటు కోరిక మగని రూపాన నిలిచింది

నీ పేరు మెదలిన మధురాధరము పైన

చిరు చేదు చిలికింది... జీవితమె మారింది

చిరుచేదు చిలికింది... జీవితమె మారింది 


కథ విందువా...నా కథ విందువా

విథికి బదులుగ నువ్వు 

నా నుదుట వ్రాసిన కథ విందువా...

నా కథ విందువా


చరణం 3 :



శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము

శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము

తాళినే ఎగతాళి చేసింది ధనము

కాముకుల కాహుతైపోయింది మానము

నా పాలి నరకమై మిగిలింది ప్రాణము

నా పాలి నరకమై మిగిలింది ప్రాణము


కథ విందువా... నా కథ విందువా

విథికి బదులుగ నువ్వు 

నా నుదుట వ్రాసిన కథ విందువా...

నా కథ విందువా


పాటల ధనుస్సు 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి