కలువ కనులు మూయకు
చిత్రం : మా ఊరి దేవత (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వీటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
కలువ కనులు మూయకు...
కలలే అలలై చెలరేగును
పెదవులు కదిలించకు..
వలపే పిలుపై రాగాలు పలికించునే..
చిలిపి చూపు చూడకు...
తనువు మనసు పులకించులే...
వలపు వలలు వేయకు...
వగలే సెగలై నాలోన రగిలించులే
కలువ కనులు మూయకు...
కలలే అలలై చెలరేగునే
చరణం 1 :
ఈ..... వేడి కౌగిలి.. కరిగే.... చిరుగాలి
ఏ పూర్వ పుణ్యము చేసిందో
ఈ..... వేడి కౌగిలి... కరిగే.... చిరుగాలి
ఏ పూర్వ పుణ్యము చేసిందో
నా రాజు పాదాల నలిగే పూబాల
ఎన్నెన్ని నోములు నోచిందో...
వరమే కాదా అనురాగం...
కొందరికేలే ఆ యోగం
కొందరికేలే ఆ యోగం..
కలువ కనులు మూయకు ...
కలలే అలలై చెలరేగునే
చరణం 2 :
నీ.... ప్రేమ బంధాల.... వెలిగే అందాలు
నా జీవితాన నవనందనాలు..
నీ.... ప్రేమ బంధాల.... వెలిగే అందాలు
నా జీవితాన నవనందనాలు
ఈ వింత గిలిగింత బ్రతుకంత పులకింత
నా గుండెలో మ్రోగే మురళీ రవాలు..
ఈ పాట మన ప్రేమకే ఆనవాలు
ఈ జన్మకిది చాలు పదివేలు..
ఈ జన్మకిది చాలు పదివేలు..
కలువ కనులు మూయకు..
కలలే అలలై చెలరేగును..
వలపు వలలు వేయకు...
వగలే సెగలై నాలోన రేగిలించులే..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి