22, డిసెంబర్ 2022, గురువారం

అందంగా ఉన్నావు గోవిందా రామా | Andamga vunnavu | Song Lyrics | Ranikasula Rangamma (1981)

అందంగా ఉన్నావు గోవిందా రామా



చిత్రం :  రాణీకాసుల రంగమ్మ (1981)

సంగీతం :  చక్రవర్తి

రచన : దాసం గోపాలకృష్ణ 

నేపధ్య గానం :  బాలు, సుశీల  



పల్లవి :


అందంగా ఉన్నావు గోవిందా రామా... 

అందితే నీ సొమ్ము పోయిందా భామా..

అందంగా ఉన్నావు గోవిందా రామా... 

అందితే నీ సొమ్ము పోయిందా భామా...

హే.. హా.... భామా


అందంగా ఉన్నాను గోవిందా రామా.. 

అందకుంటే నీ సొమ్ము పోయిందా మావా..

హే..హా.. మావా.... షబబరిబ..



చరణం 1 :


పులకలెన్నో రేపుతుంటావు.. 

పలకరిస్తే రేపు అంటావు...

తళుకులెన్నో ఆరబోస్తావు.. 

తారలాగా అందనంటావు...

న్యాయమా.... ధర్మమా.. .. 

న్యాయమా.... ధర్మమా


ముద్దులన్నీ మూటగట్టి 

ఉట్టిమీద పెట్టుంచాను మావా..

కన్నుగొట్టి.. చేయిపట్టి.. 

చేయమంటే ప్రేమబోణీ...

న్యాయమా.... ధర్మమా... 

న్యాయమా.... ధర్మమా...


అందంగా ఉన్నావు గోవిందా రామా.. 

అందకుంటే నీ సొమ్ము పోయిందా మావా...



చరణం 2 : 



కోకకడితే కొంగు పడతావు.. 

పూలు పెడితే బెంగ పడతావు

చేపలాగా ఈతలేస్తావు.. 

చూపులోనే జారిపోతావు...

న్యాయమా.... ధర్మమా... 


రాజుకొన్న మూజు మీద 

జాజిపూలు వాడిపోయే భామా

లేత సోకో పూత రేకో.. 

చేయనంటే మేజువాణి...

న్యాయమా.... ధర్మమా... 

న్యాయమా.... ధర్మమా...


అందంగా ఉన్నాను గోవిందా రామా... 

అందకుంటే నీ సొమ్ము పోయిందా 

మావా.. హే...  అహా..


పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి