ఎర్రా బుగ్గల మీద
చిత్రం : గూఢచారి 116 (1966)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఎర్రా బుగ్గల మీద మనసైతే...
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసైతే...
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...
కాని ఇందరిలో ఏం బాగుంటుంది
ఎర్రా బుగ్గల మీద మనసుంది...
కాని ఇందరిలో ఏం బాగుంటుంది
చరణం 1 :
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా
మొక్కజొన్న తోటలోన
మక్కువంత తెలుసుకుంటే
నక్కి ఉన్న నక్కలన్నీ నవ్వుకుంటయే
ఎర్రా బుగ్గల మీద మనసైతే...
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...
కాని ఇందరిలో ఏం బాగుంటుంది
చరణం 2 :
కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ... రేవు కాడ...
కాకినాడ... రేవు కాడ...
కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ రేవు కాడ కళ్లు కళ్లు కలుపుకుంటే
ఓడలోని నీటుగాళ్లు ఊరకుంటరా
ఎర్రా బుగ్గల మీద మనసైతే...
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...
కాని ఇందరిలో ఏం బాగుంటుంది
చరణం 3 :
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా
గండిపేట... చెరువు కాడ...
గండిపేట... చెరువు కాడ...
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా
గండిపేట చెరువు కాడ
గుండెలోతు తెలుసుకుంటే
గండు పులులు పొంచి పొంచి
గాండ్రుమంటయే
ఎర్రా బుగ్గల మీద మనసైతే...
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...
కాని ఇందరిలో ఏం బాగుంటుంది
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి