ఎండావానా నీళ్ళాడాయి
చిత్రం: దేవత (1982)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
ఎండావానా నీళ్ళాడాయి.. కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి.. కోనసీమల్లో
ఎండావానా నీళ్ళాడాయి.. కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి.. కోనసీమల్లో
కొండ కోన దాటాలంటే..
మనమేం చేయాలి.. ఓహో
చెప్పొద్దు చేసేయి.. సందె పొద్దుల్లో
ఈ పొద్దు ముంచేయి ముద్దే ముద్దుల్లో
ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
చరణం 1 :
హ్హ హ్హ హ్హ హ్హ హ్హ..
చేయి చేయి కలవంగానే..చెరిగే పొలిమేరా..ఆ
కన్ను కన్ను నీలో నన్ను..కలిపేయ్ కసితీరా..ఆ
ప్రేమకు..పెళ్ళీడొస్తుంటే.. పెదవులు ముద్దాడేస్తుంటే
కాలం ఆపు కాసేపూ.. లోకం రాదు మనవైపు
మల్లెల పందిరి..అల్లరి వయసును..
తొందర పెడుతుంటే
సన్నాయి మోగాలి.. గుండెగొతుల్లో
తువ్వాయి..గెంతాలి..కొండ కోనల్లో
ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
కొండ కోన దాటాలంటే..
మనమేం చేయాలి..ఓహో..ఓఓఓ
చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా
ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో
ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
చరణం 2 :
చూపు చూపు..కలవంగానే..పొడిచే చుక్కంటా..ఆ
చుక్కా..ఎన్నెల..పక్కే మనకు..మాపటి దిక్కంటా
ఇంకా దగ్గరకొస్తుంటే..ఏ..
అందం అక్కరకొస్తుంటే..ఏ
అలలే ఆపు కాసేపూ.. కలలే రేపు నీ చూపు
పొడిచే ఊహల ఊపిరి కబురులు వడగాలౌతుంటే
వెచ్చంగ నిండాలి..పల్లె పాటల్లో..ఓ
పచ్చంగ పండాలి..పైరు పంటలూ..ఓ
ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
కొండ కోన దాటాలంటే..
మనమేం చేయాలి..లోహో..ఓఓఓ
చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా
ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో
ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి