10, అక్టోబర్ 2022, సోమవారం

కోటి జన్మల ఆనందం | Koti Janmala Anandam | Song Lyrics | Raja (1976)

కోటి జన్మల ఆనందం



చిత్రం :  రాజా (1976)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :


కోటి జన్మల ఆనందం... 

శతకోటి జన్మల అనుబంధం...

కోటి జన్మల ఆనందం 

శతకోటి జన్మల అనుబంధం

నీవు నేనై వెలిశాము నేడు మళ్ళీ కలిశాము

రాజా... ఓ నా రాజా ...రాజా.. ఓ నా రాజా

రాణీ... ఓ నా రాణీ ..రాణీ... ఓ నా రాణీ...



చరణం 1:


నీ సుతిమెత్తని ఒడిలో పవలిస్తాను

నీ నులివెచ్చని ఊపిరిలో పులకిస్తాను

నీ సుతిమెత్తని ఒడిలో పవలిస్తాను

నీ నులివెచ్చని ఊపిరిలో పులకిస్తాను


నీ నునుపారని నొసట నే ముద్దవుతాను

నీ కనుపాపల క్రీనీడా జీవిస్తాను


జీవితాన చీకటంతా చెదిరిపోవాలి

చెదిరి పోనీ మమతలు మనకు చెరలు కావాలి..

చెరలు కావాలి

రాజా... ఓ నా రాజా..రాజా ...ఓ నా రాజా


చరణం 2:


నీ ఎద లోపలి దీపాన్నై నే ఉంటాను

నా కథ నడిపే నాయకుడై నీవుంటావు

నీ ఎద లోపలి దీపాన్నై నే ఉంటాను

నా కథ నడిపే నాయకుడై నీవుంటావు


నా చిరకాలపు కోరికవై నీవుంటావు

నీ పరువానికి పండుగనై నే ఉంటాను


మల్లెపూల మనసులనే అల్లుకుందాము

ఎల్లలన్ని తుడిపివేసి ఏలుకుందాము...

ఏలుకుందాము...


రాణీ... ఓ నా రాణీ ..రాణీ... ఓ నా రాణీ..

కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం

నీవు నేనై వెలిశాము నేడు మళ్ళీ కలిశాము


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి