7, అక్టోబర్ 2022, శుక్రవారం

ఎవరో నీవు ఎవరో నేను | Evaro neevu evaro nenu | Song Lyrics | Rakta Sambandhalu (1975)

ఎవరో నీవు ఎవరో నేను



చిత్రం :  రక్త సంబంధాలు (1975)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం : సుశీల, బాలు


పల్లవి :

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. 

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం..


ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా

హరి ఓం.. హరి ఓం.. పాడరా     


ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా

హరి ఓం.. హరి ఓం..  హరి ఓం.. ఓం పాడరా 



చరణం 1 :


నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . 

నేను నీవేరా

నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . 

పాలు నీళ్ళేరా


నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . 

నేను నీవేరా

నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . 

పాలు నీళ్ళేరా

ఎగాదిగా నిగా వేస్తే ఏముందిరా        


హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా    

ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా


చరణం 2 :


అంత౦త కొండ అద్దంలో చుడరా 

ఇంతింత అయిపోవురా

ఇంతింత విత్తనం అంత౦త వృక్షమై 

ఎంతో ఎదిగేనురా


అంత౦త కొండ అద్దంలో చుడరా 

ఇంతింత అయిపోవురా

ఇంతింత విత్తనం అంత౦త వృక్షమై 

ఎంతో ఎదిగేనురా

వేమన్న తావన్న. .  వింత ఇదేరా 


హరి ఓం . . హరి ఓం . . హరి ఓం . . 

ఓం.. పాడరా    

ఎవరో నీవు.. ఎవరో నేను . . 

అంతా మాయరా

హరి ఓం . . హరి ఓం . .  హరి ఓం . . 

ఓం.. పాడరా  


చరణం 3 :


గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. 

కళ్ళల్లో ఉన్నాడురా

ఓ మూఢా.. కళ్ళు ముసేసి చూడు.. 

ముందే ఉన్నాడురా 


గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. 

కళ్ళల్లో ఉన్నాడురా

ఓ మూడా.. కళ్ళు ముసేసి చూడు.. 

ముందే ఉన్నాడురా

ఒరే ఒరే ఇదే ఇదే.. పరమ నిజంరా    


హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా    

ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి