2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా | Rotte virigi nethilo paddaka | Song Lyrics | Gharana Donga (1980)

 రొట్టె విరిగి నేతిలో పడ్డాకా



చిత్రం : ఘరానా దొంగ (1980)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. 

లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. 

లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా


అందగత్తె చూస్తుంటే... 

అందమంత ఇస్తుంటే...

అర్థ రాత్రి గడిపేది ఎట్టాగా... 

అర్థ రాత్రి గడిపేది ఎట్టాగా


రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. 

లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. 

లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా


అందమైన ఈడుంటే... 

అందగాడు తోడుంటే...

చందమామ నిదరోయేదెట్టాగా... 

చందమామ నిదరోయేదెట్టాగా


చరణం 1 :

కౌగిట్లో కాలాలు కరగాలని... 

తప్పెట్లు తాళాలు మోగాలని

వలపుల్ని దాచేసి ఒంటరిగుంటే... 

చెలి తోడు లేకుంటే ఎట్టాగా

ఎట్టాగా... ఎట్టాగా..


ఆ కౌగిళ్లే మన ఇల్లు కావాలని... 

మల్లె పొదరిళ్లే  పడకిళ్లు కావాలని

కలగంటే కాదంటే ఎట్టాగా... 

చలి తీరి పోతుంటే ఎట్టాగా

ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. 

గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. అబ్బా.. 

లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా



చరణం 2 :


వానల్లే నువ్వొచ్చి తడపాలని... 

వరదల్లే నే పొంగిపోవాలని

చినుకుల్లో ఇల్లేసి ఒణుకుతు ఉంటే... 

చెలికాడు రాకుంటే ఎట్టాగా

ఎట్టాగా.. ఎట్టాగా


చుక్కల్లో పక్కేసుకోవాలని... 

రెండు దిక్కుల్ని కలిపేసుకోవాలని

అనుకుంటే తప్పైతే ఎట్టాగా.. 

ఈ ఆపలేని పులకింతలెట్టాగా


ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా..

గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా   


రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. 

లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా

అందగత్తె చూస్తుంటే... 

అందమంత ఇస్తుంటే...

అర్థ రాత్రి గడిపేది ఎట్టాగా... 

అర్థ రాత్రి గడిపేది ఎట్టాగా


రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. 

లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా

అందమైన ఈడుంటే... 

అందగాడు తోడుంటే...

చందమామ నిదరోయేదెట్టాగా... 

చందమామ నిదరోయేదెట్టాగా


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి