15, సెప్టెంబర్ 2022, గురువారం

నిన్ను మరిచిపోవాలనీ | Ninnu Marachipovalani | Song Lyrics | Manchi Manushulu (1974)

నిన్ను మరిచిపోవాలనీ



చిత్రం:  మంచి మనుషులు (1974)

సంగీతం:  కె.వి. మహదేవన్

గీతరచయిత:  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం:  బాలు


పల్లవి:


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక... మానుకున్నా.. ..


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక... మానుకున్నా.. ..


చరణం 1:


నువ్వు విడిచి వెళ్ళినా.... 

నీ రూపు చెరిగిపోలేదూ..ఊ

నువ్వు మరలి రాకున్నా 

నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ

నువ్వు విడిచి వెళ్ళినా.... 

నీ రూపు చెరిగిపోలేదూ..ఊ

నువ్వు మరలి రాకున్నా 

నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ....


తలుపు తెరిచి ఉంచుకొనీ.. 

తలవాకిట నిలిచున్నా..ఆ

వలపు నెమరేసుకుంటూ.. 

నీ తలపులలో బ్రతికున్నా..ఆ


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక... మానుకున్నా.. ..


చరణం 2:


ఎందుకిలా చేశావో..ఓ..నీకైనా తెలుసా

నేనెందుకింకా ఉన్నానో.. 

నాకేమో తెలియదూ..ఊ..

ఎందుకిలా చేశావో..ఓ..నీకైనా తెలుసా

నేనెందుకింకా ఉన్నానో.. 

నాకేమో తెలియదూ..ఊ..


నేను చచ్చిపోయినా.. 

ఆ నా ఆశ చచ్చిపోదులే...

నిన్ను చేరు వరకు .. 

నా కళ్ళు మూతపడవులే..


నిన్ను మరిచిపోవాలనీ.. 

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక...మానుకున్నా.. ..


చరణం 3:


గుండెలోన చేశావూ..ఊ.. 

ఆరిపోని గాయాన్నీ..ఈ

మందుగా ఇచ్చావు.. 

మన వలపు పంట పసివాణ్ణీ..

గుండెలోన చేశావూ..ఊ.. 

ఆరిపోని గాయాన్నీ..ఈ

మందుగా ఇచ్చావు.. 

మన వలపు పంట పసివాణ్ణీ..


ఆ లేత మనసు తల్లికోసం.. 

తల్లడిల్లుతున్నదీ..

నీ తల్లి మనసు తెలియకనే 

దగ్గరవుతూ వున్నదీ..


నిన్ను మరిచిపోవాలనీ..

అన్ని విడిచి వెళ్ళాలనీ..

ఎన్నిసార్లో అనుకున్నా...ఆ.. 

మనసు రాక మానుకున్నా

మనసు రాక...మానుకున్నా.. ..


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి