3, సెప్టెంబర్ 2022, శనివారం

బంగారు బాల పిచ్చుక | Bangaru Bala Pichuka | Song Lyrics | Krishnarjunulu (1982)

బంగారు బాల పిచ్చుక



చిత్రం :  కృష్ణార్జునులు (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :

హే.. హెహె.. హే.. హే

ఆ.. ఆ.. ఆ..ఆ .... అహహా...అరరరరా..

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఒహొహో.. అరరరరా.. 


బంగారు బాల పిచ్చుక...క...

నీ చూపులతో నన్ను గిచ్చక.. క...

వెచ్చగుంది పచ్చిక... చేసుకో మచ్చిక

మురిపాల ముద్దు ముచ్చికా.. 

అరే.... దుబుదుబుదుబు

మురిపాల ముద్దు ముచ్చికా.. 

అరే....దుబుదుబుదుబు


బంగారు బాల పిచ్చుక...క...

నీ మాటలతో పొద్దు పుచ్చక....క...

మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా

మనసివ్వు నాకు మచ్చుగా... 

అరే..దుబుదుబుదుబు

మనసివ్వు నాకు మచ్చుగా... 

అరే..దుబుదుబుదుబు



చరణం 1 :



వాలు చూపుల వంతెనేసి.. 

వంటి దూరం దాటకుంటే

పిచ్చుకెగిరి గూడు మిగిలేనే......ఏ..ఏ..

కంటి పాపల జోలపాడి... 

జంట ఊయల ఊగకుంటే

చిచ్చు రగిలి గోడు మిగిలేనే......ఏ..ఏ..


అచ్చట్లాడే.. ముచ్చట్లాడే.. 

అందమిచ్చుకో

ఎప్పట్లాగే.. చప్పట్లేసి.. 

ఈడు తెచ్చుకో

దుబుదుబుదుబు... 

బంగారు బాల పిచ్చుక...క..  

నీ చూపులతో నన్ను గిచ్చక

మాపటేల వెచ్చగ.. 

మల్లెపూలు గుచ్చగా

మనసివ్వు నాకు మచ్చుగా... 

అరే.. దుబుదుబుదుబు

మనసివ్వు నాకు మచ్చుగా... 

అరే.. దుబుదుబుదుబు


చరణం 2 :


మల్లెజాజుల మంచు తీసి... 

పిల్లగాలితో చల్లకుంటే

పిచ్చి ముదిరి ప్రేమ రగిలేనే...ఏ..ఏ..

ఆయ్..చందమామ ముద్దుపెట్టే... 

సందె కబురే పంపకుంటే

ఉచ్చు బిగిసి  ఊపిరాగేనే...ఏ...ఏ..


అచ్చమత్త బుచ్చబ్బాయి లగ్గమెట్టుకో

అచ్చొత్తాయి అందాక నీ బుగ్గలిచ్చుకో..


దుబుదుబుదుబు...

బంగారు బాల పిచ్చుక....క..క..

నీ మాటలతో పొద్దు పుచ్చక...క..క..

మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా

మనసివ్వు నాకు మచ్చుగా... 

అరే..దుబుదుబుదుబు

మనసివ్వు నాకు మచ్చుగా... 

అరే..దుబుదుబుదుబు



బంగారు బాల పిచ్చుక...క..క..  

నీ చూపులతో నన్ను గిచ్చక.. క.. క..

వెచ్చగుంది పచ్చిక... చేసుకో మచ్చిక

మురిపాల ముద్దు ముచ్చికా.. 

అరే..దుబుదుబుదుబు

మురిపాల ముద్దు ముచ్చికా.. 

అరే..దుబుదుబుదుబు


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి