పాడవోయి భారతీయుడా
చిత్రం : వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : శ్రీశ్రీ
నేపథ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
పాడవోయి భారతీయుడా..
ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ..
పాడవోయి భారతీయుడా..
ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ..ఆ
పాడవోయి భారతీయుడా...
నేడే స్వాతంత్య్ర దినం.. వీరుల త్యాగఫలం..
నేడే స్వాతంత్య్ర దినం.. వీరుల త్యాగఫలం
నేడే నవోదయం... నీదే ఆనందం..
పాడవోయి భారతీయుడా..
ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ..
పాడవోయి భారతీయుడా....
చరణం 1 :
ఓ..ఓ..ఓ...స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి..
స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి...
సాధించినదానికి సంతృప్తిని పొంది...
అదే విజయమనుకుంటే పొరపాటోయి...
ఆగకోయి భారతీయుడా..
కదిలి సాగవోయి ప్రగతిదారులా..ఆ..ఆ..ఆ
ఆగకోయి భారతీయుడా..
కదిలి సాగవోయి ప్రగతిదారులా..ఆ..ఆ...
ఆగకోయి భారతీయుడా...
చరణం 2 :
ఆకాశం అందుకొనే ధరలొకవైపు..
అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
ఆకాశం అందుకొనే ధరలొకవైపు..
అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
అవినీతి.. బంధుప్రీతి.. చీకటి బజారూ..
అలముకున్న నీ దేశమెటు దిగజారూ..
కాంచవోయి నేటి దుస్థితి..
ఎదిరించవోయి ఈ పరిస్థితి..ఈ..ఈ..ఈ
కాంచవోయి నేటి దుస్థితి..
ఎదిరించవోయి ఈ పరిస్థితి..ఈ..ఈ..ఈ
కాంచవోయి నేటి దుస్థితి...
చరణం 3 :
పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ..
భాషాద్వేషాలూ చెలరేగే నేడూ..
పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ..
భాషాద్వేషాలూ చెలరేగే నేడూ..
ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే..
ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే.....
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..
స్వార్థమే అనర్థ కారణం..
అది చంపుకొనుటే క్షేమదాయకం..
స్వార్థమే అనర్థ కారణం..
అది చంపుకొనుటే క్షేమదాయకం..
స్వార్థమే అనర్థ కారణం...
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం..
నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..
నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం...
\సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం...
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే..
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం..
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి