10, జూన్ 2022, శుక్రవారం

పండంటి జీవితం | Pandanti Jeevitham | Song Lyrics | Pandanti Jeevitham (1981)

పండంటి జీవితం



చిత్రం : పండంటి జీవితం (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి : 


పండంటి జీవితం... రెండింటికంకితం

పండంటి జీవితం...  రెండింటికంకితం


ఒకటి నీ మనసు... ఒకటి నీ మమత

మమత ఉన్న మనసు కన్న ఏది శాశ్వతము 


పండంటి జీవితం... రెండింటికంకితం




చరణం 1 :



చిలకపచ్చని చీరకట్టి... మొలక నవ్వుల సారె పెడితే

పులకరింతల పూలు తెస్తున్నా...

పులకరింతల పూలు తెస్తున్నా...


చిలిపి కన్నుల పలకరించి... వలపు వెన్నెల చిలకరిస్తే

కౌగిలింతకు నేను వస్తున్నా...

కౌగిలింతకు నేను వస్తున్నా...



ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను... 

ఆ మాట నువ్వంటే నే దొరకను

ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను... 

ఆ మాట నువ్వంటే నే దొరకను


ఆ... ఇంత హొయలు... 

ఇన్ని లయలు నాకు శాశ్వతము


పండంటి జీవితం... రెండింటికంకితం



చరణం 2 :


సందెగాలికి జలదరించే అందమంతా విందు చేస్తే..

వలపు పానుపు పరచుకుంటున్నా....

వలపు పానుపు పరచుకుంటున్నా.... 


హాయి తీపిని మోయలేక సాయమడిగి సరసకొస్తే..

మల్లెచెండే దిండు చేస్తున్నా...

మల్లెచెండే దిండు చేస్తున్నా...


ఎదలోన ఎద ఉంది పొదరిల్లుగా... 

నా ఇల్లు నాకుంటే అది చాలుగా

ఎదలోన ఎద ఉంది పొదరిల్లుగా... 

నా ఇల్లు నాకుంటే అది చాలుగా


మనసు ఉన్న మనువు కన్న ఏది శాశ్వతమూ... ఊ... 


పండంటి జీవితం... రెండింటికంకితం


పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి