7, జూన్ 2022, మంగళవారం

ఆ ముద్దబంతులు | Aa Muddabanthulu | Song Lyrics| Pasupu Parani (1980)

 ఆ ముద్దబంతులు...

చిత్రం : పసుపు పారాణి (1980)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం :  సుశీల

పల్లవి :

ఆ ముద్దబంతులు...

ఆ ముద్దబంతులు పసుపు రాశులు పోసే వాకిళ్ల ముందు

ఆ ముద్దమందారు పారాణి దిగ బోసే లోగిళ్ల సందు

పసుపు పారాణితో పెళ్ళి జరిగేను

పసుపు పారాణితో పెళ్ళి జరిగేను

ఏడడుగులేసేను... ఏకమైయ్యేను 

ఆ ముద్దబంతులు పసుపు రాశులు పోసే వాకిళ్ల ముందు

ఆ ముద్దమందారు పారాణి దిగ బోసే లోగిళ్ల సందు

చరణం 1 :

తొంగేడు పూలల్లే పసుపు పూయాలి... 

తామరరేకల్లే పారాణి రాయాలి

తొంగేడు పూలల్లే పసుపు పూయాలి... 

తామరరేకల్లే పారాణి రాయాలి

పసుపు సున్నము కలిపి పారాణాయే

పసుపు సున్నము కలిపి పారాణాయే

పసుపుపారాణితో ఇల్లాలు ఆయే

ఆ ముద్దబంతులు పసుపు రాశులు పోసే వాకిళ్ల ముందు

ఆ ముద్దమందారు పారాణి దిగ బోసే లోగిళ్ల సందు 

చరణం 2 :

ఉదయాన సూరీడు పసుపు పండించె... ఆ.. ఆ..

అస్తమించే వేళ పారాణి పొంగించె... ఆ.. ఆ..

ఉదయాన సూరీడు పసుపు పండించె... ఆ.. ఆ..

అస్తమించే వేళ పారాణి పొంగించె... ఆ.. ఆ..

గడపలకు నిత్యమూ పసుపు పారాణే...

గడపలకు నిత్యమూ పసుపు పారాణే...

కాళ్ళకు పెళ్ళికే పసుపు పారాణి

ఆ ముద్దబంతులు పసుపు రాశులు పోసే వాకిళ్ల ముందు

ఆ ముద్దమందారు పారాణి దిగ బోసే లోగిళ్ల సందు

పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి