11, మే 2022, బుధవారం

ప్రియుడా పరాకా | Priyuda Paraka | Song Lyrics | Agni Poolu (1981)

ప్రియుడా పరాకా  ప్రియతమా పరాకా



చిత్రం : అగ్నిపూలు (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : సుశీల



పల్లవి :


ప్రియుడా పరాకా... ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా


ప్రియుడా పరాకా... ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా


మిసమిసలాడే ఈ మేనురా.. నీదేనురా

రారా చెరగనీకు చిలిపి కంటి కాటుకా  


ప్రియుడా పరాకా... ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా



చరణం 1 :


ఒంటి నిండా ఒంపులూ... కంటి నిండా మెరుపులూ

ఓపలేని విరహవేదన వేడి బుసలూ

వయసు వగలు సెగలు 


ఒంటి నిండా ఒంపులూ... కంటి నిండా మెరుపులూ

ఓపలేని విరహవేదన వేడి బుసలూ 


హా..హా.. తాళజాలరా ..

హా..హా.. జాలమేలరా

జరగరానీ... నా కోరికా...

నా వేడుకా.. నీతో తీరకుంటే ఏలరా నా పుట్టుకా


ప్రియుడా పరాకా...  ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా



చరణం 2 :


నన్ను నీవు రమ్మని... నీకు నాపై ప్రేమని

రెచ్చగొడితే సోకులన్నీ చేసుకుంటిని.. 

నిన్నే చేరుకుంటిని


నన్ను నీవు రమ్మని... నీకు నాపై ప్రేమని

రెచ్చగొడితే సోకులన్నీ చేసుకుంటిని...

హా..హా.. చూడవేమిరా..

హా.. హా... పాడి కాదురా..


చులకనయ్యానా... ఇంతలో నీ చూపులో

లేరా .. లేత వలపు పూతకొచ్చెను చూడరా



ప్రియుడా పరాకా...  ప్రియతమా పరాకా

వన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకా... 

వలచి వస్తే పరాకా


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి