9, మే 2022, సోమవారం

పలికెను నాలో పల్లవిగా | Palikenu Naalo | Song Lyrics | Alludu Pattina Bharatam (1980)

పలికెను నాలో పల్లవిగా



చిత్రం :  అల్లుడు పట్టిన భరతం (1980)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


పలికెను నాలో పల్లవిగా...

పలికెను నాలో పల్లవిగా

అరవిరిసే అనురాగం...

అరవిరిసే అనురాగం...

నా పరువాలే పాడగా... ఆ... ఆ.. ఆ..



పలికెను నాలో పల్లవిగా...

పలికెను నాలో పల్లవిగా 


చరణం 1 :



కడలిని కోరి గిరులను దాటి... 

సెలయేరు దిగిదిగిరాగా

కడలిని కోరి గిరులను దాటి... 

సెలయేరు దిగిదిగిరాగా


మిన్నుల్లో పూచే వెన్నెల తానే 

ఈ నేల ముద్దాడి పోదా

నిను నిన్ను చూసి నను నేనే మరచి

నిను నిన్ను చూసి నను నేనే మరచి

నిన్నంటి రాలేదా...

ఆ పరువాలే పాడగా.. ఆ.. ఆ.. ఆ... 



పలికెను నాలో పల్లవిగా...

పలికెను నాలో పల్లవిగా 



చరణం 2 :



మిలమిల మెరిసే జిలిబిలి 

నవ్వే అలివేణి పెదవికి అందం

మిలమిల మెరిసే జిలిబిలి 

నవ్వే అలివేణి పెదవికి అందం



జలజల కురిసే తొలకరి 

జల్లే నింగికి నేలకు బంధం

ఆ అందమేదో... ఆ బంధమేదో...

ఆ అందమేదో  ఆ బంధమేదో 

ఇరువురి అనుబంధం


ఆ పరువాలే పాడగా.. ఆ.. ఆ.. ఆ... 



పలికెను నాలో పల్లవిగా...

పలికెను నాలో పల్లవిగా

అరవిరిసే అనురాగం...

అరవిరిసే అనురాగం...

నా పరువాలే పాడగా... ఆ... ఆ.. ఆ..


పలికెను నాలో పల్లవిగా...

పలికెను నాలో పల్లవిగా


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి