22, మే 2022, ఆదివారం

ఏమని వ్రాయనూ | Emani Vrayanu | Song Lyrics | Peddalu Marali (1974)

ఏమని వ్రాయనూ



చిత్రం :  పెద్దలు మారాలి (1974)

సంగీతం :  బి. గోపాలం

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  సుశీల, బాలు 


పల్లవి :


ఏమని వ్రాయనూ?.. ఏమని వ్రాయనూ?

ప్రతి పలుకూ విరహగీతమై.. 

పరవశింప జేస్తుంటే..


ఏమని వ్రాయనూ?.. ఏమని వ్రాయనూ?

ప్రతి పలుకూ నీ రూపమై.. 

పలకరించి పోతుంటే..


ఏమని వ్రాయనూ?.. ఏమని వ్రాయనూ?

ప్రతి పలుకూ విరహగీతమై.. 

పరవశింప జేస్తుంటే..


ఏమని వ్రాయనూ?.. ఏమని వ్రాయనూ?

ప్రతి పలుకూ నీ రూపమై.. పలకరించి పోతుంటే..

ఏమని వ్రాయనూ?... 



చరణం 1:


నింగిలోన తారలున్నా..  

నీ కనుపాపలే కనిపించగా

నింగిలోన తారలున్నా.. 

నీ కనుపాపలే కనిపించగా


తోటలోన పూలెన్ని ఉన్నా.. 

తోటలోన పూలెన్ని ఉన్నా

నీ సిగమల్లెలే కవ్వించగా.. 


ఏమని వ్రాయనూ?..   


చరణం 2 :


మొదటి రేయి మూగహాయి.. 

ఎదలో ఇంకా పులకించగా

మొదటి రేయి మూగహాయి.. 

ఎదలో ఇంకా పులకించగా


పిదప పిదప పెరిగిన మమతా.. 

పిదప పిదప పెరిగిన మమతా

వేయింతలుగా వికసించగా.. 


ఏమని వ్రాయనూ?...   


చరణం 3 :


ఏ కలనైనా నీవే.. నీవే.. నీవే...

ఏ కలనైనా నీవే.. నీవే.. 

నా కౌగిలిలో నిదురించగా


అన్ని వేళలా నీవే.. నీవే.. నీవే..

అన్ని వేళలా నీవే నీవే.. 

నా కన్నులలో నివసించగా

  

ఏమని వ్రాయనూ..  ఏమని వ్రాయనూ

ప్రతి పలుకూ విరహగీతమై.. 

పరవశింప జేస్తుంటే..


ప్రతి పలుకూ నీ రూపమై.. 

పలకరించి పోతుంటే..  

పరవశింప జేస్తుంటే.. 

పలకరించి పోతుంటే...  


లలలా.. లలల..లాలల.. 

పలకరించి పోతుంటే

లలలా.. లలల..లాలల.. 

పలకరించి పోతుంటే


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి