19, ఏప్రిల్ 2022, మంగళవారం

సిరిమల్లె పువ్వు మీద | Sirimalle puvvu meeda | Song Lyrics | Rajaputra Rahashyam (1978)

సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా



చిత్రం :  రాజపుత్ర రహస్యం (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...

కోరికేదో కోన దాటిపోయిందే... 

నా కోరికేదో కోనదాటిపోయిందే


గోరింట పొదరింట గోరింకా...

కోరికంతా కోక చుట్టుకుంటాలే... 

నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే


సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...

కోరికేదో కోన దాటిపోయిందే...



చరణం 1 :



కొండా ఉందీ కోనా ఉందీ... 

కొండమల్లీ వానా ఉంది

కోరుకున్నా నీ ఒడిలో 

వలపు నారుమడి నాకుంది


కన్నెవలపు కట్నాలిస్తా... 

వెన్నమనసు కానుకలిస్తా...

వస్తావా కరిగిస్తావా...

నీ గడసరి అల్లికలిస్తే... 

నా మగసిరి మల్లికలిస్తా...

వస్తావా కలిసొస్తావా


కౌగిట నన్నే కాచుకో... 

మీగడలన్నీ దోచుకో..

నన్నే నీతో పంచుకో... 

నిన్నే నాలో పెంచుకో...

హ... హా.. కౌగిట నన్నే కాచుకో... 

మీగడలన్నీ దోచుకో..

నన్నే నీతో పంచుకో... 

నిన్నే నాలో పెంచుకో...



సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా... 

కోరికేదో కోన దాటిపోయిందే...

గోరింట పొదరింట గోరింకా... 

నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే... 



చరణం 2 :


ఆకు ఉందీ పిందె ఉందీ... 

రేకు విరిసే సోకూ ఉందిపువ్వూ ఉందీ పూతా ఉందీ... 

మల్లెపొదలా మాటు మనకుంది


దుక్కిపదును పంటలు కోస్తా... 

మొక్కజొన్న కండెలు ఇస్తావస్తావా... 

ముద్దిస్తావా.. హహా

బంతిపూలా పక్కలు వేస్తా...  

గున్నమావి జున్నులు పెడతావస్తావా...  

మురిపిస్తావా


రెక్కల రెపరెపలెందుకో... 

చుక్కల విందులు అందుకో

చిక్కని వలపుల పొందులో... 

తొలి సిగ్గులనే దులిపేసుకో...

హహా...  రెక్కల రెపరెపలెందుకో... 

చుక్కల విందులు అందుకో

చిక్కని వలపుల పొందులో... 

తొలి సిగ్గులనే దులిపేసుకో...



సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా... 

కోరికేదో కోన దాటిపోయిందే...

గోరింట పొదరింట గోరింకా... 

నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే


సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...

కోరికేదో కోన దాటిపోయిందే...


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి