8, ఏప్రిల్ 2022, శుక్రవారం

కట్టుకున్నా అదే చీర | Kattukunna ade Cheera | Song Lyrics | Pogarubotu (1976)

కట్టుకున్నా అదే చీర



చిత్రం : పొగరుబోతు (1976)

సంగీతం : కె. వి. మహదేవన్

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : సుశీల



పల్లవి :


కట్టుకున్నా అదే చీర.. 

పెట్టుకున్నా అవే పూలు

ఇంతగ నిన్నే వలచే నన్నే 

ఎందుకలా చూస్తావూ

ఇంకా.. ఇంకా.. ఉడికిస్తావూ


కట్టుకున్నా అదే చీర.. 

పెట్టుకున్నా అవే పూలు

ఇంతగ నిన్నే వలచే నన్నే 

ఎందుకలా చూస్తావూ

ఇంకా.. ఇంకా.. ఉడికిస్తావూ

కట్టుకున్నా అదే చీర.. 

పెట్టుకున్నా అవే పూలు


చరణం 1 :


చేద బావిలో చందురూడూ.. 

చిలిపిగ మునకేస్తున్నాడు

ఈ మగువ మనసులో మరో చంద్రుడూ.. 

తగని అల్లరి చేస్తున్నాడూ

చేద బావిలో చందురూడూ.. 

చిలిపిగ మునకేస్తున్నాడు

ఈ మగువ మనసులో మరో చంద్రుడూ 

తగని అల్లరి చేస్తున్నాడూ 


చంద్రుని మునకలు నీటి వరకేనా

అందగాని అల్లరి అంతవరకేనా.. 

అంతంతవరకేనా


కట్టుకున్నా అదే చీర.. 

పెట్టుకున్నా అవే పూలు


చరణం 2 :


మైకం పెంచే మధువేమో 

చీకటిలా కమ్మేస్తుందీ

ఇల్లాలిచ్చె వలపేమో 

ఎన్నో జన్మల వెలుగౌతుందీ

మైకం పెంచే మధువేమో

 చీకటిలా కమ్మేస్తుందీ

ఇల్లాలిచ్చె వలపేమో 

ఎన్నో జన్మల వెలుగౌతుందీ


వేసిన బంధం కాదంటావా..

వేచిన అనదం వలదంటావా.. 

మరి ఏమంటావూ


కట్టుకున్నా అదే చీర.. 

పెట్టుకున్నా అవే పూలు

ఇంతగ నిన్నే వలచే నన్నే 

ఎందుకలా చూస్తావూ

ఇంకా.. ఇంకా.. ఉడికిస్తావూ

కట్టుకున్నా అదే చీర.. 

పెట్టుకున్నా అవే పూలు


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి