18, మార్చి 2022, శుక్రవారం

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా | Raani Ranamma | Song Lyrics | Maa Pallelo Gopaludu (1985)

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా



చిత్రం : మా పల్లెలో గోపాలుడు (1985)

సంగీతం : కె.వి.మహదేవన్

రచన : సి.నారాయణరెడ్డి (సినారె)

గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల


రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా

నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...

నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...

ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా


రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని

నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని

రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని

నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని

ఎంతగా అనుకున్నాను ...ఏమిటి చూస్తున్నాను?

ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను?

పన్నీటి బతుకులోన... కన్నీటి మంటలేనా


రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా 

నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...

ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా


రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా

రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా

సహనం స్త్రీకి కవచమనీ.. శాంతం అందుకు సాక్ష్యమని..

సహనం స్త్రీకి కవచమనీ.. శాంతం అందుకు సాక్ష్యమని..

ఉన్నాను మౌనంగా కన్నులుదాటని కన్నీరుగా

రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా


గుండెరగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే

కాళ్ళుబండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే

గుండెరగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే

కాళ్ళుబండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే

ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం

ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం

ఎదురీత ఆగదులే... విధిరాత తప్పదులే


రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా

నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...

ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి