9, మార్చి 2022, బుధవారం

ఒకటి రెండు మూడు | Okati Rendu Moodu | Song Lyrics | Tiger (1979)

ఒకటి..రెండు..మూడు



చిత్రం : టైగర్ (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


ఒకటి..రెండు..మూడు..నాలుగు..ఐదు..ఆరు..ఏడు

అబ్బో..అమ్మో..అయ్యయ్యో..

ఒకటా..రెండా..మూడా..ఓరి దేవుడో 

నా వల్ల కాదు కాదురో... ఓరి నాయనో

కళ్ళు తిరిగిపోతున్నాయ్... 

కాళ్ళు వణికిపోతున్నాయ్

తియ్యలేను గుంజీలు... 

తిప్పలు పెట్టకురో..ఓఓఓ 


ఒకటి..రెండు,మూడు... తీయ్ గుంజీలు

వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ

కళ్ళు తిరిగిపోతున్నా... 

కాళ్ళువణికిపోతున్నా

తియ్యాలి గుంజీలు... 

తిమ్మిరి అణిగేదాకా


ఒకటా..రెండా..మూడా... 

ఓరి దేవుడో

హహహా..వల్లకాదు కాదంటే... 

చెల్లదమ్మడూ..




చరణం 1 :



మబ్బులేని మెరుపల్లే ఎవ్వడు రమ్మన్నాడు..

ఆహా ఆహా హా హా హా...ఆ

మల్లెపూల జల్లులో తడిపేసి పొమ్మన్నాడు..ఊ

ఆహా ఆహా హా హా హా...ఆ 


అందుకే వేస్తున్నా... అందమైన శిక్షా

అందుకే వేస్తున్నా... అందమైన శిక్షా

తీర్చుకొంటున్నా... తియ్య తియ్యగా కక్షా


ఏమిటి పరీక్షా?


ఒకటా..రెండా..మూడా... ఓరి దేవుడో

నీ వల్లకాదు కాదంటే..

చెల్లదమ్మడూ... అమ్మడూ  



చరణం 2 :



చలిగాలి వడదెబ్బ..

ఎవ్వడు తీయమన్నాడు..

ఊ..ఊ అహహా

సూదిమెరుపంటి చూపుల్తో..

చురకేసి పొమ్మన్నాడూ..

ఊ..అట్లగా..ఒహోహో

వయసొచ్చి చేసింది వలపన్న నేరం

వయసొచ్చి చేసింది వలపన్న నేరం

కౌగిట్లో ఖైది చేసేయ్... నను జీవితాంతం..

అయ్యో పాపం 


ఒకటి..రెండు,మూడు... తీయ్ గుంజీలు

వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ


కళ్ళు తిరిగిపోతున్నాయ్... 

కాళ్ళు వణికిపోతున్నాయ్

తియ్యలేను గుంజీలు... 

తిప్పలు పెట్టకురో..ఓ.. 


ఒకటా..రెండా..మూడా..ఓరి దేవుడో

నీ..వల్లకాదు కాదంటే... 

చెల్లదమ్మడూ... అమ్మడూ


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి