13, మార్చి 2022, ఆదివారం

ముద్దబంతి పువ్వమ్మ | Muddabanthi Puvvamma | Song Lyrics | Ragile Jwala (1981)

ముద్దబంతి పువ్వమ్మ... పొద్దుపొడుపు నవ్వమ్మ



చిత్రం :  రగిలే జ్వాల (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : బాలు, సుశీల 




పల్లవి :



ముద్దబంతి పువ్వమ్మ... పొద్దుపొడుపు నవ్వమ్మ

సందెకాల సూరీడు... అందగాడినన్నాడు

కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక 

వచ్చాడోయమ్మ 




ముద్దబంతి పువ్వమ్మ... పొద్దుపొడుపు నవ్వమ్మ

సందెకాల సూరీడు... అందగాడినన్నాడు

కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక 

వచ్చాడోయమ్మ 




చరణం 1 :




ఎలుగులు నావంటే..ఏ..ఏ...

సొగసులు నీవంటే...ఏ..ఏ

ఎలుగులు నావంటే... సొగసులు నీవంటే...


ఓ సూపు సూసింది.. ఓ నవ్వు రువ్వింది..

ఓ సూపు సూసింది.. ఓ నవ్వు రువ్వింది..



సూపూసుఫు సుట్టలంటాడు... 

రేపోమాపో కాపురమంటాడు

పెళ్ళెప్పుడమ్మా... ఇల్లెక్కడమ్మా

పిల్లొప్పుకుంటే... ఐనప్పుడమ్మా

దీపమెట్టినాక నికూ నాకూ వేరే ధ్యాసే లేదమ్మా




ముద్దబంతి పువ్వమ్మ... పొద్దుపొడుపు నవ్వమ్మ

సందెకాల సూరీడు... అందగాడినన్నాడు

కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక 

వచ్చాడోయమ్మ 




చరణం 2 :



ముందుకు వచ్చాడే... ఏ... ఏ

ముచ్చట పడ్డాడే... ఏ... ఏ

ముందుకు వచ్చాడే... ముచ్చట పడ్డాడే..


గోరంత ముద్దిచ్చి... గోరింటలిచ్చాడే

గోరంత ముద్దిచ్చి... గోరింటలిచ్చాడే


కొమ్మా కొమ్మకు కోకలు కట్టిందోయ్

ముద్దులగుమ్మ మునకాలేసిందోయ్


కోకెక్కడమ్మ... రైకెక్కడమ్మ

సిగ్గెందుకమ్మ... సెట్టెక్కెనమ్మ

సీకటొచ్చి నాకు చీర కట్టిపోతే.. 

సిన్నబోయెరమ్మా



ముద్దబంతి పువ్వమ్మ... పొద్దుపొడుపు నవ్వమ్మ

సందెకాల సూరీడు... అందగాడినన్నాడు

కొండ సాటు నుండి కొంగు సాటుకు దాక 

వచ్చాడోయమ్మ


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి