24, మార్చి 2022, గురువారం

చలిగాలి వీచింది సనజాజి పూసింది | Chaligali veechindi | Song Lyrics | Bobbili Brahmanna (1984)

చలిగాలి వీచింది.. సనజాజి పూసింది



చిత్రం  :  బొబ్బిలి బ్రహ్మన్న (1984)

సంగీతం  : చక్రవర్తి

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  : బాలు, సుశీల  



పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..

చలిగాలి వీచింది.. సనజాజి పూసింది

సందిళ్ళకే చేరుకో...

ఏ గాలికి సంధివ్వకు.. ఏ పూలకి ముద్దవ్వికు

నీ ముద్దు నాదైన వేళా...


ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..

చెలి గాలి వీచింది... సనజాజి పూసింది

కౌగిళ్ళకే చేరుకో...

ఏ గాలికి సంధివ్వకు.. ఏ పూలకి ముద్దవ్వికు

నీ ముద్దు నాదైన వేళా... 


చరణం 1 :

వేళకు వచ్చి.. వెచ్చగ ఇచ్చి.. కౌగిలితోనే కమ్ముకుపోనా

ఆ.. బుగ్గలు గిచ్చి.. సిగ్గులు పెంచే చక్కిలిగింతే చల్లుకుపోనా


జరిగి జరిగి జంటకు రానా

అడిగి అడిగి అల్లుకుపోనా

చలిగా మారే సావాసంలో..

జతనే కోరే సాయంత్రంలో...

పొదరిల్లు మనదైన వేళా ... ఆ.. ఆ..


ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..

చలిగాలి వీచింది.. సనజాజి పూసింది

సందిళ్ళకే చేరుకో...



చరణం 2 :


చీకటి నేసే.. చీరలు తెచ్చి.. చేతికి చెండై చెంతకు రానా

వెన్నెలకైనా .. వేడిని పెంచే.. సోకుల పండు కోసుకుపోనా


మరిగి మరిగి మాపటి వేళా..

చెలికి చలికి దుప్పటి కానా

నిశిరాత్రైనా నిదరే రాదు

వయసొచ్చాక వరసే వేరు

మసకెస్తే మతిపోవు వేళా.. ఆ.. ఆ.. ఆ.. 


ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..

చలిగాలి వీచింది.. సనజాజి పూసింది

సందిళ్ళకే చేరుకో..



- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి