8, ఫిబ్రవరి 2022, మంగళవారం

తొలి చూపు దూసిందీ | Tolichupu dusindi | Song Lyrics | Abbayigaru Ammayigaru (1972)

 తొలి చూపు దూసిందీ



చిత్రం  :  అబ్బాయిగారు అమ్మాయిగారు (1972)

సంగీతం  : కె. వి. మహదేవన్

గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి :


తొలి చూపు దూసిందీ..హృదయాన్ని

మరుచూపు వేసిందీ..బంధాన్ని

ప్రతి చూపు చెరిపింది..దూరాన్ని

పెళ్ళిచూపులే..కలపాలి ఇద్దరిని    

తొలిచూపు దూసిందీ..హృదయాన్ని

మరుచూపు వేసిందీ..బంధాన్ని 


చరణం 1 :


ఒక చూపు తూపులా గాయాన్ని చేసిందీ

వేరొక చూపు  వెన్నెల మావులా మెరిసిందీ

ఒక చూపు తూపులా గాయాన్ని..చేసిందీ

వేరొక చూపు వెన్నెల మావులా మెరిసిందీ

ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టిందీ

ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టిందీ

వేరొక చూపు..  వేరొక చూపు

నిలువునా గెలుచుకొని వెళ్ళిందీ 

తొలిచూపు దూసిందీ.. హృదయాన్ని

మరుచూపు వేసిందీ.. బంధాన్ని



చరణం 2 :


చూపులున్నందుకు చూసుకోవాలీ

చూచుకున్నది తనది చేసుకోవాలీ

వలపు మొలకెత్తేది ఒక చూపులోనే

మనసు మనసయ్యేది ఆ చూపుతోనే  

ఈడు జోడుగ మనమిద్దరం వెళుతుంటే

ఎన్నెన్ని చూపులో ఈసుతో చూస్తాయి

ఈడు జోడుగ మనమిద్దరం వెళుతుంటే

ఎన్నెన్ని చూపులో ఈసుతో చూస్తాయి

తోడు నీడగ మనం ఏకమైనామంటె

తోడు నీడగ మనం ఏకమైనామంటె

దేవతల చూపులే దీవెనలు అవుతాయి 

తొలిచూపు దూసిందీ హృదయాన్ని

మరుచూపు వేసిందీ బంధాన్ని

ప్రతి చూపు చెరిపింది దూరాన్ని

పెళ్ళిచూపులే కలపాలి ఇద్దరిని        


అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ

అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ

అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ

అ..హ..హా..ఆ ఆ ఆ ఆ ఆ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి