20, ఫిబ్రవరి 2022, ఆదివారం

తెల్లావారే తెల్లావారే | Tellavare Tellavare | Song Lyrics | Raga Deepam (1982)

తెల్లావారే తెల్లావారే



చిత్రం :  రాగదీపం (1982)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం :  సుశీల, రామకృష్ణ 



పల్లవి : 


తెల్లావారే తెల్లావారే

సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ

తెల్లావారే తెల్లావారే

సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ


నువ్వు లేవనంటే... మగత తీరదంటే..

సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ

సూరీడొచ్చి లేపుతాడు లేరా


తెల్లావారే తెల్లావారే

వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ

తెల్లావారే తెల్లావారే

వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ


నేను లేవనంటే... కాదు కూడదంటే

జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ

జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా



చరణం 1 :



లోగిలంత ఇంటిలోనా... వాకిలంత చోటు చాలు

లోగిలంత ఇంటిలోనా..ఆ..వాకిలంత చోటు చాలు

లోతులంత చూడకుండా..ఆ..వాకిలేసి ఉంచుమేలూ


వాకిలేసినా... వేసి తీసినా... వలపు కళ్ళు మూతపడవూ

ప్రేమ వాకిళ్ళు... మూతపడవూ..


తెల్లావారే తెల్లావారే

వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ

తెల్లావారే తెల్లావారే

సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ


నేను లేవనంటే... కాదు కూడదంటే

సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ

జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ



చరణం 2 :



పాలమబ్బు పాన్పులోనా... పట్టుకోక చాటు చాలు 

పాలమబ్బు పాన్పులోనా... పట్టుకోక చాటు చాలు


పాలవెన్నగుండేలోనా..ఆ..పిడికిడంత చోటు చాలు

చోటు దొరికినా..పాట చాలినా... ఊరుకోవు చిలిపితలుపులూ

అవి పాడుతాయి నేల పలుకులూ


తెల్లావారే తెల్లావారే

వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ

తెల్లావారే తెల్లావారే

సూరీడొచ్చే వేళ ఆయె లేరా..ఆ


నేను లేవనంటే... కాదు కూడదంటే

సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ

జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి